మరో సినీ ప్రముఖుడి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

బాలీవుడ్‌లో మరో ప్రముఖుడి ఆరోగ్యం విషమించింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ నదీమ్ ఖాన్‌కు ఆరోగ్యం విషమించడంతో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నారు. ఇటీవల బ్రెయిన్ సర్జరీ జరిగిన తర్వాత ఆయన ఆరోగ్యం పరిస్థితి దిగజారింది. ఆ తర్వాత ఆయనకు అనేక సమస్యలు తలెత్తాయని భార్య పార్వతి మీడియాకు వెల్లడించింది. మంగళవారం ఆయన తల, భుజానికి, ఛాతిపై గాయాలు కావడంతో ముంబైలోని లీలావతీ హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం నదీమ్ ఖాన్ ఐసీయూలో ఉన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నది. 72 గంటలు దాటితే గానీ ఆయన పరిస్థితి చెప్పలేమని అంటున్నారు. ఇప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సకు ఆయన స్పందించడం లేదు అని భార్య పార్వతి చెప్పారు.

Bollywood Cinematographer Nadeem Khan health worsen

కరోనా లాక్‌డౌన్ కారణంగా సకాలంలో ఆయనకు చికిత్స జరుగలేదు. అందుకే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు అయిన గాయం మొదట చిన్నగా ఉండేది. సరైన సమయంలో చికిత్స జరుగకపోవడం వల్ల గాయం పెద్దదిగా అయింది. దాంతో అనేక సమస్యలు తలెత్తాయి అని చెప్పారు.

ప్రస్తుతం ఆయనకు కోవిడ్ 19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ట్రీట్‌మెంట్‌కు అదే అడ్డంకిగా మారింది. గత రెండు నెలలుగా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. ఎవరినీ కలువలేదు. రాపిడ్ టెస్ట్ చేయడం లేదు. ఆయన ట్రీట్‌మెంట్ అందించడంలో జాప్యం జరుగుతున్నది అని నదీమ్ ఖాన్ భార్య అన్నారు.

నదీమ్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. డిస్కో డ్యాన్సర్, జమానా, ఆంధీ తుఫాన్, ఆగ్ హీ ఆగ్, కింగ్ అంకుల్, గునా చిత్రాలకు నదీం ఖాన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 1998లో చంకీ పాండ నటించిన తిర్చి టోపివాలే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మోనికా బేడి, ఇందర్ కుమార్ తదితరులు నటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X