డ్రగ్స్ కేసులో కమెడియన్‌కు ఊరట.. కోర్టు బెయిల్ మంజూరు

బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాతో లింకుల వ్యవహారంలో అరెస్ట్ అయిన కమెడియన్ భారతీ సింగ్‌కు ఊరట లభించింది. శనివారం భారతీ సింగ్‌తోపాటు ఆమె భర్త హార్ష్ లింబాచియాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం భారతీ సింగ్ దంపతుల ఇంటిపై దాడి చేసి వారి నుంచి 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. వెంటనే వారికి సమన్లు జారీ చేసి ప్రశ్నించారు.

భారతీ సింగ్, హర్ష్ గంజాయి వినియోగించినట్టు అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేశారు. అనంతరం వారిని డిసెంబర్ 4వ తేదీ వరకు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.

Bollywood Comedian Bharti Singh gets bail in Drug case by NCB

తమను అరెస్ట్ చేయడంతో భారతీ సింగ్ దంపతులు ఆదివారం బెయిల్ కోసం కోర్టును సంప్రదించారు. వారి తరఫున న్యాయవాది అయాజ్ ఖాన్ వాదనలు వినిపించారు. వారిపై వచ్చిన ఆరోపణలు చాలా చిన్నవి. వాటి ఆధారంగా వేసిన కేసు పెద్దగా పట్టించుకోనవసరం లేదని వాదనకు కోర్టు సానుకూలంగా స్పందించి బెయిల్ మంజూరు చేశారు.

సుశాంత్ సింగ్ మరణం తర్వాత డ్రగ్స్ వినియోగం, సరఫరా కేసులో పలువురిని ప్రశ్నించి అరెస్ట్ చేశారు. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రియాకు బెయిల్ లభించగా, షోవిక్‌కు ఇంకా బెయిల్ లభించడకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X