Kamaal R Khan ఫిట్‌నెస్ ట్రైనర్‌పై లైంగిక దాడి.. వారంలో రెండోసారి బాలీవుడ్ నిర్మాత అరెస్ట్

బాలీవుడ్ నటుడు, నిర్మాత, క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్‌ను మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సినీ దిగ్గజాలు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను.. ఆయనను గత వారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లైంగిక ఆరోపణల కేసులో మరోసారి కేఆర్కేను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆగస్టు 29, 2020లో ఇర్పాన్ ఖాన్, రిషీ కపూర్‌ను ఉద్దేశించి ట్విట్టర్‌లో అభ్యంతరకరమైన ట్వీట్లు చేశాడు. దాంతో అతడిని గతవారం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 2021లో ఓ ఫిట్‌నెస్ ట్రైనర్‌ తనపై కేఆర్కే లైంగిక దాడి చేశారని ఆరోపిస్తూ.. కేసు నమోదు చేశారు. ఆ కేసులో కమల్ ఆర్ ఖాన్‌ను సెప్టెంబర్ 3వ తేదీన వెర్సోవా పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. ఆ తర్వాత హాలీడే కోర్టులో ఆదివారం ప్రవేశపెట్టారు. దాంతో ఆయనను కోర్టు జుడిషియల్ కస్టడీకి తరలించింది.

 Bollywood Critic and Producer Kamaal R Khan arrested in molestation case

ఫిట్‌నెస్ ట్రైనర్‌పై లైంగిక దాడి ఘటన 2019లో జరిగింది. ఆమె 2021లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇండస్ట్రీలో పలుకుబడి ఉందనే భయంతో నేను ఫిర్యాదు చేయడానికి వెనకడుగు వేశాను. అందుకే ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశాను అని బాధితురాలు వెల్లడించినట్టు తెలిపారు.

బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే వారం రోజుల వ్యవధిలో రెండోసారి అరెస్ట్ కావడం భారీ చర్చకు దారి తీసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X