కల్కి 2898 AD నిర్మాతల 20 కోట్ల పరువు నష్టం దావా.. రివర్స్ కేసుతో బాలీవుడ్ క్రిటిక్ ట్విస్ట్!

చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమా దగ్గర ఒక రీ సౌండింగ్ హిట్ ఏదన్నా ఉంది.. అది కూడా మన తెలుగు సినిమా నుంచి అంటే అది పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన తాజా చిత్రం "కల్కి 2898 ఎడి" అని చెప్పి తీరాలి. కొడితే లెక్క 1100 కోట్ల దగ్గరకి వెళ్లి భారీ రికార్డులు అందుకుంది. కాగా ఈ సినిమా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సెన్సేషనల్ వసూళ్లు అందుకొని నాన్ బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా విషయంలో వచ్చిన పాజిటివిటీతో పాటుగా చాలా వరకు నెగిటివిటీ కూడా వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్ లో చాలా మంది ఈ చిత్రంపై ప్రభాస్ పై కానీ చాలా నెగిటివ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా అయితే చాలా కాలం నుంచి ప్రభాస్ సినిమాలపై పనిగట్టుకొని నెగిటివ్ కామెంట్స్ చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు.

bollywood critic gave shock to bollywood handle on kalki 2898 ad 20 crore controversy

అలా ఈ చిత్రంపై అప్డేట్స్ ఇస్తున్న సమయంలో సినిమా రిలీజ్ సమయంలో కూడా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ క్రిటిక్స్ కల్కి సినిమాపై పెద్ద ఎత్తున నెగిటివ్ పోస్ట్ లు పెట్టిన ప్రముఖ క్రిటిక్స్ సుమిత్ కడెల్ సహా మరో క్రిటిక్ పై పరువు నష్టం దావా అది కూడా ఏకంగా 20 కోట్లు వేసి షాకిచ్చారని కొన్ని వార్తలు అదే బాలీవుడ్ మార్కెట్ లో వినిపించాయి.

దీనితో ప్రభాస్ అభిమానులు కూడా ఆ వార్తలని వైరల్ చేసి నిర్మాత అశ్వినీదత్ కల్కి పై నెగిటివ్ చేసిన వారికి కరెక్ట్ గుణపాఠం చెప్పారని హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే సుమిత్ కడెల్ ఏకంగా నాకు ఒక కోట రూపాయలు పరువు నష్టం దావా ఇవ్వాలి అంటూ పోస్ట్ చేసాడు. కాగా తన వెర్షన్ ఏమిటంటే నా మీద ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన బాలీవుడ్ హంగామా వారిపై నేను ఇప్పుడు కేసు పెట్టానని వారు నాకు క్షమాపణలు చెప్పాలి.

ఇది తేలిగ్గా వదలను నా లీగల్ టీం తో ఏం చెయ్యాలో అది చేస్తాను, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టుగా పోస్ట్ చేసాడు. దీనితో ఇది ఒక షాకింగ్ ట్విస్ట్ గా మారింది. అంటే సుమిత్ పై కల్కి మేకర్స్ కేసు వేయలేదా? వేయకుండానే బాలీవుడ్ హంగామా వారే కావాలని పోస్ట్ చేసారా అనేవి ఇపుడు క్లియర్ అవుతున్నాయి.

మరి మరి క్రిటిక్ అయితే ఇంకా ఎలాంటి స్పందన అందించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది మాత్రం బాలీవుడ్ హంగామా వారికి ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. కాగా ఈ భారీ చిత్రంలో ప్రభాస్ ఒక్కడే కాకుండా అమితాబ్ బచ్చన్, ఉలగనయగన్ కమల్ హాసన్ లు నటించగా వారితో పాటుగా దీపికా పదుకొనె అద్భుతమైన పాత్ర ఈ సినిమాలో చేసింది. అలాగే దిశా పటాని, శోభన, మృణాల్ ఠాకూర్ రాజేంద్ర ప్రసాద్ అలాగే ఇతర నటీనటులు ముఖ్య పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X