Kamal R Khan సినీ విమర్శకుడు, నిర్మాత అరెస్ట్.. ఆ ఇద్దరిపై వివాదాస్పద ట్వీట్లతో..!

బాలీవుడ్‌లో వివాదాస్పద నటుడు, సినీ విశ్లేషకుడు, జర్నలిస్టు కమల్ ఆర్ ఖాన్‌ అలియాస్ కేఆర్కే ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం ఉదయం ముంబై ఎయిర్‌పోర్టులో ఆయనను మలాడ్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం మీడియాలో వైరల్ అయింది. ఈ అరెస్ట్ వివరాల్లోకి వెళితే...

2020 వివాదాస్పద పోస్టులు

2020 వివాదాస్పద పోస్టులు

2020లో కమల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదంగా మారింది. ఆ పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా కేఆర్కేకు పలు దఫాలు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దాంతో మలాడ్ పోలీసులు ఆగస్టు 30వ తేదీన ఉదయం ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేయడం జరిగింది అని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌పై పోస్టులు

రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌పై పోస్టులు

ఇదిలా ఉండగా, వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉండే కమల్ ఆర్ ఖాన్.. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్ మరణాలపై ప్రశ్నలు సంధిస్తూ కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేశారు. కేఆర్కే ట్వీట్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. శివసేనకు చెందిన యువసేన కార్యకర్త రాహుల్ కనల్ మలాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 153A, 294, 500, 501, 505, 67, 98 కింద కేసు నమోదు చేసి లుకౌట్ నోటీస్ జారీ చేశారు.

శివసేన కార్యకర్త ఫిర్యాదుతో

శివసేన కార్యకర్త ఫిర్యాదుతో

కమల్ ఆర్ ఖాన్ అరెస్ట్‌పై శివసేన కార్యకర్త రాహుల్ కనల్ స్పందిస్తూ.. నేను చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను ముంబై అరెస్ట్ చేశారు. కేఆర్కే అరెస్ట్‌ను స్వాగతిస్తున్నాను. అభ్యంతరకరమైన భాషతో అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోసైటీలో అలాంటి బిహేవియర్ అభ్యంతరకరం. కేఆర్కే అరెస్ట్‌తో సోషల్ మీడియా తప్పుగా వాడితే ఇలాంటి చర్యలు తప్పవని ముంబై పోలీసులు బలమైన హెచ్చరికను జారీ చేశారు అని అన్నారు.

ఎవరీ కమల్ ఆర్ ఖాన్

ఎవరీ కమల్ ఆర్ ఖాన్

ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను బోరివలీ కోర్టులో హాజరుపరిచారు. ఇక కమల్ ఆర్ ఖాన్ విషయానికి వస్తే.. బాలీవుడ్ సినిమాలను ఎటాక్ చేస్తూ తన రివ్యూలతో వివాదాస్పదంగా మారారు. హిందీ, భోజ్‌పురి చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ 3 సీజన్‌‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X