స్టార్ హీరోలతో స్టెప్స్ వేయించిన డాన్స్ మాస్టర్ ఆత్మహత్య!
బాలీవుడ్ డాన్స్ మాస్టర్ అభిజీత్ షిండే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హిందీలో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్ లాంటి స్టార్లతో పని చేసిన అభిజీత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకునికుని కనిపించాడు. అయితే సంఘటన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు.
కుటుంబ కలహాలే అతడి ఆత్మహత్యకు కారణం అయుండొచ్చని భావిస్తున్నారు. షిండే భార్య గత మూడు నెలలుగా అతడితో ఉండకుండా తన పుట్టింట్లోనే ఉంటోంది. తమ రెండేళ్ల పాపను కూడా భర్త కలవకుండా అడ్డపడుతోందట.

కొన్నిరోజులుగా షిండే మనస్థాపంతో ఉన్నాడని, డిప్రెషన్లో ఉన్నాడని, కుటుంబంలో ఏర్పడ్డ కలతలే అతడి ఆత్మహత్యకు కారణం అయుండొచ్చని బాలీవుడ్ పత్రికలు తమ కథనంలో పేర్కొన్నాయి.
ఈ సంఘటనపై భందుప్ సినియర్ ఇన్స్ స్పెక్టర్ రమేష్ ఖడే మాట్లాడుతూ... 'అభిజీత్ షిండే మరణాన్ని యాక్సిడెంటల్ డెత్‌గా రిజిస్టర్ చేయించామని, శివ పంచనామా, పోస్టమార్టమ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు.


Click it and Unblock the Notifications











