కరణ్ జోహార్ సంచలన ప్రకటన.. భారీ ఆదాయం అందుకున్న ఆ షో ఇక ఉండబోదని కఠిన నిర్ణయం!
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా దర్శకుడిగా అలాగే నటుడిగా ఎంతగానో గుర్తింపు అందుకున్న మల్టీ టాలెంటెడ్ పర్సన్ కరణ్ జోహార్. ముఖ్యంగా సినిమా బిజినెస్ పై ఆయనకున్న పట్టు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మరెవరికి లేదనే చెప్పాలి. అంతే కాకుండా హోస్ట్ గా కూడా కరణ్ జోహార్ పలు షోలతో మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా కరణ్ జోహార్ మంచి ఆదాయం అందుకుంటున్న ఒక టాక్ షోకు ముగింపు పలికాడు. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి నిర్మాతగా..
బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ధర్మ ప్రొడక్షన్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మినిమమ్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఆ సంస్థను తండ్రి నుంచి అదే తరహాలో కరణ్ జోహార్ కూడా కొనసాగిస్తున్నాడు. ఒక దర్శకుడిగా నిర్మాతగా కరణ్ చూడని విజయం లేదు.

హిట్ మూవీస్
కల్ హో నా కహో.. ఐ హెట్ లవ్ స్టొరీస్, ఏ జవాని హై దివాని, 2 స్టేట్స్.. ఇలా ఎన్నోవిభిన్నమైన సినిమాలతో కరణ్ జోహార్ దర్శకుడిగా మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్ లో ఓటీటీ కంటెంట్ కూడా నిర్మిస్తున్నాడు. అందులో ఎక్కువగా స్టార్ ఫ్యామిలిస్ కు చెందిన వారికి అవకాశాలు ఇస్తున్నారనే టాక్ అయితే ఉంది.

భారీగా ఆదాయం
ఇక కరణ్ జోహార్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లో ఎక్కువగా
సెలబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్ తో మంచి క్రేజ్ అందుకున్నారు. ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసిన కరణ్ జోహార్ ఆ షో ద్వారా క్రేజ్ మాత్రమే కాకుండా భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా అందుకున్నాడు. ఆ షోలో చాలా వరకు కాంట్రవర్సీ విషయాలపై కూడా కరణ్ బోల్డ్ గా కామెంట్స్ చేశాడు.

కాంట్రవర్సీ
టాప్ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే కరణ్ జోహార్ పలు మార్లు ఈ షో ద్వారా విమర్శలు కూడా చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా హార్దిక్ పాండ్య, KL రాహుల్ ఇంటర్వ్యూలో మరి బోల్డ్ ప్రశ్నలు సమాధానాలు రావడంతో అప్పట్లో ఆ ఎపిసోడ్ కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. దీంతో క్రికెటర్లపై బీసీసీఐ వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంది.

చివరగా అప్పుడే..
కాఫీ విత్ కరణ్ మొదటి సీజన్ 2004లో టెలివిజన్‌లో ప్రసారం చేయబడింది, చివరి సీజన్ స్టార్ వరల్డ్‌లో 2018లో ప్రీమియర్ చేయబడింది. ఇక ఇన్నీళ్లకు కరణ్ ఆ షో నుంచి తప్పుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ షో ఉండదని బలమైన కారణం చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిచింది.

షో నుంచి అవుట్!
"కాఫీ విత్ కరణ్ 6 సీజన్‌లుగా నా జీవితంలో అలాగే మీ జీవితంలో కూడా ఒక భాగమైంది. పాప్ కల్చర్ చరిత్రలో ప్రభావం చూపామని మా స్థానాన్ని కూడా కనుగొన్నామని నేను అనుకుంటున్నాను. అయితే కాఫీ విత్ కరణ్ తిరిగి రాదని నేను బరువెక్కిన గుండెతో ప్రకటిస్తున్నాను" అని కరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నోట్ వైరల్ గా మారింది. భారీగా ఆదాయాన్ని అందించే షో విషయంలో కరణ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కరణ్.. రణ్‌వీర్ సింగ్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'కి దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











