డ్రగ్స్ కేసులో కరణ్ జోహర్‌‌కు షాక్.. ఆ పార్టీ విషయంలో ఉచ్చు బిగించేందుకు!

బాలీవుడ్‌తో డ్రగ్స్ రాకెట్ మాఫియాతో సంబంధాలపై మరోసారి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కొరడా ఝులిపించింది. గత కొద్ది రోజులుగా నటుడు అర్జున్ రాంపాల్‌ను విచారిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్‌కు సమన్లు జారీ చేయడం ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చేనీయాంశమైంది. కరణ్ జోహర్‌కు ఎందుకు సమన్లు జారీ చేశారంటే..

కరణ్ జోహర్ ఇంటిలో పార్టీ

కరణ్ జోహర్ ఇంటిలో పార్టీ

జూలై 2019లో కరణ్ జోహర్ నివాసంలో జరిగిన పార్టీలో పలువురు బాలీవుడ్ అగ్ర నటీనటులు పాల్గొన్నారు. ఆ పార్టీ జరుగుతున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీపిక, మలైకా, అర్జున్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, రణ్‌బీర్ కపూర్, వికీ కౌశల్, షాహీద్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి వాళ్లు మద్యం మత్తులో తూలుతూ కనిపించారు. ఆ పార్టీలో భారీగా డ్రగ్స్ ఉయోగించినట్టు ఆనవాళ్లు కనిపించాయి.

కరణ్ జోహర్ పార్టీ వీడియో వైరల్

కరణ్ జోహర్ పార్టీ వీడియో వైరల్

కరణ్ జోహర్ ఇంటిలో జరిగిన విందుకు సంబంధించిన పార్టీ వీడియోను శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా ట్విట్టర్ షేర్ చేసి ప్రశ్నించాడు. ఆ తర్వాత ఎన్సీబీ అధికారులకు వీడియోను సమర్పించి ఫిర్యాదు చేశారు. దాంతో ఆ వీడియో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పంపించి నివేదికను సమర్పించారు.

డిసెంబర్ 16న సమన్లు.. 18 లోగా

డిసెంబర్ 16న సమన్లు.. 18 లోగా

తాజాగా కరణ్ జోహర్ ఇంటిలో జరిగిన పార్టీకి సంబంధించిన విషయంలో ఎన్సీబీ అధికారులు కరణ్ జోహర్‌కు డిసెంబర్ 16వ తేదీన సమన్లు పంపారు. డిసెంబర్ 18వ తేదీలోపు స్పందించాలని సమన్లలో పేర్కొన్నారు. ఆ పార్టీపై వివరాలు వెల్లడించడానికి కరణ్ జోహర్ విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

కరణ్ జోహర్‌కు కాస్త ఊరట

కరణ్ జోహర్‌కు కాస్త ఊరట

అయితే విచారణ విషయంలో కరణ్ జోహర్‌కు కాస్త ఊరట కలిగింది. స్వయంగా కరణ్ రావాల్సిన అవసరం లేదు. ఆయన తన ప్రతినిధిని పంపించి వివరాలు అందించవచ్చు. ఆ పార్టీలో షూట్ చేసిన వీడియోకు సంబంధించిన పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను అందించాలని సూచించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X