యానిమల్ కాంట్రవర్సీ.. తాజాగా స్పందించిన ఆషికీ 2 డైరెక్టర్ మోహిత్ సూరి
ఆషికీ 2 చిత్రంతో నార్త్ లోనే కాకుండా దక్షిణాది ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు దర్శకుడు మోహిత్ సూరి. 2005 నుంచి ఆయన హిందీలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అందిస్తున్నారు. ఇక తాజాగా మోహిత్ సూరి దర్శకత్వం వహించిన చిత్రం సైయారా. ఈ చిత్రంతో అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించడం విశేషం. వీరి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. జూలై 18 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా జోరుగా వసూళ్లు రాబడుతోంది. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ తో మోహిత్ సూరి సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రం గురించి మాట్లాడటం బాలీవుడ్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
యానిమల్ కాంట్రవర్సీ ఏంటీ?
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ 2023లో యానిమల్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఆయనకు రెండో చిత్రం. మొదటి చిత్రం అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ది యానిమల్ చిత్రంతో ఏకంగా బాలీవుడ్ లోనూ సంచలనంగా మారాడు సందీప్ రెడ్డి వంగ. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రంలో వయెలెన్స్, బూతు సీన్లు, అరగెంట్ పాత్రలను చూపించారని క్రిటిక్స్ తో పాటు బాలీవుడ్ లోని ప్రముఖులు రచ్చ చేశారు. అప్పట్లో ఈ చిత్రం వివాదాస్పందంగా మారింది. కానీ సినిమా విడుదలైన కొద్ది రోజులకు మాత్రం సెన్సేషన్ గా మారింది.

యానిమల్ పై డైరెక్టర్ మోహిత్ సూరి కామెంట్స్..
ఆషికీ 2, మర్డర్ 2, మలంగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన మోహిత్ సూరి తాజాగా సైయారా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన దక్కుతోంది. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన మూవీ ఈవెంట్ లో దర్శకుడు మోహిత్ సూరి డైరెక్టర్ సందీప్ రెడ్డిపైనా, ఆయన దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంపైనా స్పందించారు. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సందీప్ కు నేను ఫ్యాన్..
మోహిత్ సూరి మాట్లాడుతూ.. నేను ఇప్పుడు ప్రశ్ఛాత్తాపం పడుతున్నాను. రణబీర్ కపూర్ యానిమల్ చిత్రం విడుదల సమయంలో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అప్పుడే సినిమాపై నా అభిప్రాయాన్ని ప్రజాభిముఖంగా తెలియజేయాల్సి ఉంది. కానీ అప్పుడు సినిమా బాగుందని బహిరంగంగా చెప్పలేకపోయినందుకు ప్రశ్చాత్తం పడుతున్నాను. కానీ సందీప్ రెడ్డి వంగకు నేను వ్యక్తిగతంగా మెసేజ్ చేసి అభినందించానని చెప్పారు. మరోవైపు తను సందీప్ రెడ్డి వంగకు పెద్ద ఫ్యాన్ ను అని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.
రాబోయే చిత్రాలు..
మోహిత్ సూరి ప్రస్తుతం సైయారా చిత్రంతో ప్రేక్షకులకు మంచి సినిమాను అందించారు. ఈ చిత్రం ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేయడం విశేషం. మరోవైపు సందీప్ రెడ్డి వంగ నెక్ట్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి 'స్పిరిట్' చిత్రాన్ని డైరెక్ట్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











