twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థియేటర్స్ రికార్డులు చచ్చినట్లే..స్టార్ హీరోలకు మరో దిక్కు లేదు..సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

    |

    రోజురోజుకి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అందరిలో ఒక తెలియని భయం కలుగుతోంది. పరిస్థితులు త్వరలో అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నప్పటికీ ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పవని మరికొందరు అంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ ముందు రోజుల్లో మరిన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు శేఖర్ కపూర్ కూడా ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

    ఆశగా ఎదురుచూస్తున్నారు..

    ఆశగా ఎదురుచూస్తున్నారు..

    కరోనా వైరస్ ధాటికి థియేటర్స్ మూతపడి ఇప్పటికే నాలుగు నెలలు దాటింది. సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. థియేటర్స్ ఓపెన్ అయితే సినిమాలను రిలీజ్ చేయాలని చాలా మంది నిర్మాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితులు ఇప్పట్లో అనుకూలించేలా కనిపించడం లేదని చాలా మంది ఆశలు వదులుకున్నారు.

    100కోట్ల బిజినెస్ చచ్చిపోయింది

    100కోట్ల బిజినెస్ చచ్చిపోయింది

    ఇక కొందరు ఆర్థికంగా మరింత నష్టపోవడం ఇష్టం లేక ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనే సినిమాలను డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. అలాగే స్టార్ హీరోలకు కూడా మరొక దిక్కు లేదని మొదటి వారం 100కోట్ల బిజినెస్ అనేది చచ్చిపోయింది అంటూ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మరో ఏడాది వరకు థియేటర్స్ అనేవి ఓపెన్ అయ్యే అవకాశం లేదని ఆయన వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

    స్టార్స్ కి మరో దిక్కు లేదు..

    స్టార్స్ కి మరో దిక్కు లేదు..

    థియేట్రికల్ రిలీజ్ అనేది కూడా చచ్చిపోయింది అంటూ.. స్టార్స్ ఇక ఓటీటీ వైపు అడుగుకు వేయక తప్పదని లేదా సొంతంగా యాప్ లను క్రియేట్ చేసుకొని అందులో సినిమాలను ప్రసారం చేసుకోవాలని అన్నారు. అది తప్పితే స్టార్స్ కి మరొక దిక్కు లేదని టెక్నాలజీ ద్వారా సింపుల్ గా వాడుకోవాలని శేఖర్ కపూర్ వివరణ ఇచ్చిన తీరు కొత్త చర్చలకు దారి తీస్తోంది.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
    థియేటర్స్ ఓపెన్ అయినా కూడా..

    థియేటర్స్ ఓపెన్ అయినా కూడా..

    బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆ విధంగా కామెంట్ చేయడం బాలీవుడ్ జనాలను కాస్త ఆలోచింపజేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది సినిమా ఇండస్ట్రీలో ఆర్థికంగా చాలా నష్టపోయారు. థియేటర్స్ ఓపెన్ అవుతాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ థియేటర్స్ ఓపెన్ అయినా కూడా ఇప్పట్లో మొదటివారంలో 100కోట్ల బిజినెస్ అనేది చచ్చినట్లే అని వివరణ ఇవ్వడంతో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    English summary
    With the number of corona virus cases increasing day by day, And it seems that the film industry is going to face more problems in the days ahead. Bollywood senior actor and director Shekhar Kapoor also made sensational remarks in this regard.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X