బొక్కాబోర్లా పడిన బాలీవుడ్.. దారుణమైన ఫ్లాపులతో అగ్రహీరోలు

బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనావైరస్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం, ఓటీటీలో రిలీజైన భారీ చిత్రాలు అతలాకుతలం చేశాయి. లాక్‌డౌన్ కారణంగా పలు చిత్రాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే రిలీజ్‌కు భారీ అంచనాలను అందుకొన్న అగ్రహీరోలు, హీరోయిన్ల చిత్రాలు ప్రేక్షకుల మన్నలను అంందుకోలేక చితికలపడ్డాయి. ఘోర పరాజయాన్ని మూటగట్టుకొని అవమానాన్ని చవిచూశాయి.

అలా బాలీవుడ్‌లో భారీ పరాజయం పొందిన చిత్రాల జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సిన చిత్రం సడక్ 2, అలియాభట్ నటించిన ఈ చిత్రానికి మహేష్ భట్ దర్శకత్వం వహించారు. సుశాంత్ సింగ్ మరణం తర్వాత వచ్చిన ఈ చిత్రంపై అనేక ట్రోల్స్ జరిగాయి.

 Bollywood disaster movies in 2020: Akshay Kumar, Alia Bhatt in flop lists

ఆ తర్వాత లవ్ ఆజ్‌కల్ చిత్రం దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకొన్నది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, సారా ఆలీ ఖాన్ జంటగా నటించారు. ఈ జంట కూడా ప్రేక్షకులను ఆలరించలేకపోయింది.

ఆ తర్వాత వచ్చిన ఖాళీ పీలీ చిత్రం కూడా బొక్కబోర్లా పడింది. ఏటీటీ మోడల్‌లో రిలీజైన ఈచిత్రం కాసులు పంటను పండించలేకపోయింది. ఇషాన్ కట్టర్, అనన్య పాండే కూడా ప్రేక్షకులను నిరాశకు గురి చేశారు.

లాక్‌డౌన్‌లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్ష్మి, దుర్గామతి ఘోరమైన రిజల్ట్‌ను సొంతం చేసుకొన్నాయి. ఓటీటీలో ఎలాంటి ప్రభావం చూపలేకపోవడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X