బికినీలో అదరగొట్టిన దిశా పటానీ.. హాట్ హాట్‌గా మంత్ర ముగ్ధుల్ని..
బాలీవుడ్‌లో అద్భుతమైన సౌందర్యం ఉన్న అందగత్తెల్లో దిశా పటానీ ఒకరు. ఇటీవల కాలంలో సొగసైన శరీరాకృతితో హాట్ హాట్‌గా కనిపిస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నారు. ఇటీవల దిశా పటానీ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే ఓ బ్రాండ్ కంపెనీకి ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న దిశా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల గురించి నెటిజెన్ల మధ్య హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది.

ఫోటోషూట్ ముగిసిందని
ప్రముఖ బ్రాండ్ కోసం నా ఫొటోషూట్ ముగిసింది. ఆ కంపెనీతో గొప్ప అనుబంధం ఏర్పడింది. త్వరలోనే ఆ వివరాలను అందిస్తాను. నాకు నచ్చిన బ్రాండ్లలో అది ఒకటని చెప్పడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను అని దిశా పాటానీ షేర్ చేసింది.
ఫ్యాషన్ షోలో మెరిసిన దిశా పటానీ
అలాగే ఇటీవల నిర్వహించిన కల్కి ఫ్యాషన్ వీక్ షోలో దిశా పటానీ మెరిసింది. ఆ ఫ్యాషన్ షోలో దిశా పటానీ ఆడియెన్స్‌ను తన అందంతో మంత్ర ముగ్దుల్ని చేసింది.
ఎరుపు రంగు లంగాలో ఎంబ్రాయిడరీతో చేసిన దుస్తులను ధరించిన ఆకట్టుకొన్నది.

టాలీవుడ్‌కు దూరంగా
ఇటీవల దిశా పటానీ నటించిన చిత్రాలు వరుసగా రూ.100 కోట్ క్లబ్‌లో చేరడం విశేషం. ఎంఎస్ ధోని, భాగీ2 చిత్రాలు దిశాకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. తెలుగులో లోఫర్ చిత్రంలో కూడా కనిపించింది. కాకపోతే ఆ సినిమా నిరాశపరచడంతో దిశా పటానీ బాలీవుడ్‌కే పరిమితమైంది.

సల్మాన్ సరసన ఛాన్స్
ప్రస్తుతం భారత్ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ కొట్టేసింది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ చిత్రంతో దిశా పటానీ అగ్రహీరోయిన్‌గా గుర్తింపు పొందే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











