సిగరెట్లు కూడా తాగం.. డ్రగ్స్ గురించి తెలియదు.. డ్రగ్స్ కేసులో దీపిక, సారా, శ్రద్దాకు క్లీన్ చిట్?
బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ కేసులో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఊహించిన దానికి భిన్నంగా వార్తలు వెలుగు చూస్తున్నాయి. పీకల్లోతు కష్టాల్లో పడినట్టు కనిపించిన బాలీవుడ్ టాప్ హీరోయిన్లు దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, కరిష్మ ప్రకాశ్‌కు ఊరట లభించే వార్తలు వినిపిస్తున్నాయి. వీరి విచారణ అనంతరం ఎన్సీబీ వర్గాలు పేర్కొన్నట్టు జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం..

డ్రగ్స్ పక్కన పెడితే సిగరెట్లు కూడా తాగరు
డ్రగ్స్ కేసులో దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, కరిష్మ ప్రకాశ్ విచారించినప్పుడు మాదక ద్రవ్యాలు వాడుతున్నారనే ఆరోపణలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం వారు సిగరెట్లు కూడా తాగరనే విషయం స్పష్టమైంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా డ్రగ్స్ వాడుతున్నారనే విషయంపై వారు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని ఎన్సీబీ అధికారులు పేర్కొన్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది.

మాల్ అంటే సిగరెట్లు.. వాటి గురించి సరదాగా
వాట్సప్ ఛాట్‌లో వెలుగు చూసిన మాల్; వీడ్, హాష్, డూబ్ లాంటి కోడ్ పదాలు పలు రకాల సిగరెట్లకు సంబంధించినవి. వాటిని గురించి సరదాగా మాట్లాడుకొన్నామని సినీ తారలు వెల్లడించినట్టు సమాచారం. అవి మాల్ అంటే తక్కువ ప్రభావం చూపే సిగరెట్లు, వాటిని మాల్, హాష్, వీడ్ అంటే కొంత ఎక్కువ ఘాటుగా ఉండే సిగరెట్లు అని చెప్పారనే విషయాన్ని కథనంలో ప్రచురించారు.

సుశాంత్‌తో కొద్దికాలం అఫైర్
విచారణలో భాగంగా ప్రకాశ్ పదుకోన్, కరిష్మా ప్రకాశ్‌ను వేర్వేరు గదుల్లో విచారించాం. వారు చెప్పిన కోడ్ విషయాలపై సంతృప్తి చెందాం అని ఎన్సీబీ అధికారులు వెల్లడించినట్టు తెలిసింది. సుశాంత్ సింగ్‌తో కొద్దికాలం అఫైర్ కొనసాగింది. ఆయనపై నమ్మకం లేకపోవడంతో బ్రేకప్ జరిగిందని సారా ఆలీ ఖాన్ చెప్పారనే విషయాన్ని ఎన్సీబీ చెప్పినట్టు జాతీయ పత్రిక కథానాన్ని వెల్లడించింది.
Recommended Video

డ్రగ్స్ కేసులో సినీ తారలకు క్లీన్ చిట్?
సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని విచారణ సందర్బంగా బయటకు వచ్చిన విషయాల ఆధారంగా సారా ఆలీ ఖాన్‌కు సమన్లు జారీ చేశారు. ఈ విచారణ సందర్భంగా దాదాపు దీపిక పదుకోన్, సారా ఆలీ ఖాన్, శ్రద్దాకపూర్, కరిష్మ ప్రకాశ్‌కు క్లీన్ చిట్ దాదాపు ఇచ్చినట్టుగా అధికారులు పేర్కొన్నారనే విషయాన్ని కథనంలో జాతీయ మీడియా వెల్లడించింది.


Click it and Unblock the Notifications











