Irrfan Khan no more: దు:ఖ సాగరంలో బాలీవుడ్.. విషాదంలో మహేష్, అమితాబ్, రకుల్, అనన్య..

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతితో హిందీ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతితో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన లేని లోటును తలచుకొని దు:ఖ సాగరంలో మునిగిపోయారు. తన సన్నిహితుడిని కోల్పోయిన బాలీవుడ్ ప్రముఖులు ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇర్ఫాన్ మృతికి సంతాపం ప్రకటించిన వారిలో ..

ఇర్ఫాన్ ఖాన్ మృతిపై మహేష్ బాబు

ఇర్ఫాన్ ఖాన్ మృతిపై మహేష్ బాబు స్పందించారు. ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త నన్ను విషాదంలోకి నెట్టింది. బ్రిల్లియెంట్ యాక్టర్‌ను కోల్పోయాం. ఆయన మరణం నన్ను వ్యక్తిగతంగా తీవ్రంగా కలిచివేసింది. ఆయన కుటుంబానికి, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.

ఫరాన్ అఖ్తర్ ట్వీట్

హిందీ చిత్ర పరిశ్రమలోని గొప్ప నటుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. వెండితెర మీద మీరు చేసిన మ్యాజిక్ ఇక కనిపించదు. మీరు మాకు దూరం కావడం చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని దర్శక, నటుడు ఫరాన్ అఖ్తర్ ట్వీట్ చేశారు.

ధరమ్ తేజ్ ట్వీట్

జీవిత నాటక రంగం నుంచి ఇలా త్వరగా నిష్క్రమిస్తారని ఊహించలేదు. భారతీయ సినిమా తెరకు లభించిన ఆణిముత్యం ఇర్ఫాన్ ఖాన్. ఆయన మృతితో విషాదంలో కూరుకుపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు.

Recommended Video

Irrfan Khan Passes Away At 53 | 3 రోజుల క్రితమే తల్లి కూడా...!!

అమితాబ్ దిగ్రాంతి

ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారనే వార్త ఇప్పుడే తెలిసి తీవ్ర దిగ్రాంతికి గురయ్యాను. చాలా విషాదకరమైన, మనసును కలిచివేసే వార్త. ఆయన అద్భుతమైన, ప్రతిభావంతుడైన నటుడు. గొప్ప సన్నిహితుడు. ప్రపంచ సినిమాకు ఎనలేని సేవ చేసిన నటుడు. ఇంత త్వరగా మమల్ని వీడిపోతారని కలలో కూడా ఊహించలేదు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అని అమితాబ్ ట్వీట్ చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్

ఇర్ఫాన్ ఖాన్ మృతి వార్తతో గుండె పగిలింది. ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోవడం నిజంగా విషాదకరం. ఆయన గొప్ప హృదయం కలిగిన వ్యక్తి. భౌతికంగా మీరు దూరమైనా ఎప్పుడూ మా గుండెల్లో ఉంటారు. మీ కుటుంబానికి భగవంతుడు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను. భారమైన హృదయంతో నీ ఆత్మకు శాంతి కలుగాలని వేడుకొంటున్నాం అని రకుల్ ప్రీత్ సింగ్ ట్వీట్ చేశారు.

పరిణితి చోప్రా..

ఇర్ఫాన్ సార్.. మీరు గొప్ప ఉన్నతమైన వ్యక్తి. ఎప్పడూ ప్రశాంతంగా కనిపిస్తారు. మీతో మాట్లాడిన ప్రతీసారి అదో మంచి జాపకంగా మిగిలిపోయింది. ప్రపంచం గొప్ప ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయింది. గొప్ప మానవతావాది. జీవన పోరాట యోధుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబానికి మనోస్థైర్యం ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. అంటూ పరిణితి చోప్రా ట్విట్ చేశారు.

ప్రణీత సుభాష్ ట్వీట్

ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్త షాకింగ్.. గుండెలను పిండేసినట్టు అయింది. ఇర్ఫాన్ ఖాన్ ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని హీరోయిన్ ప్రణీత సుభాష్ ట్వీట్ చేశారు.

ఉర్మిలా మతోంద్కర్ ట్వీట్

ఇర్ఫాన్ ఖాన్ మృతితో విషాదంలో మునిగిపోయాను. అద్బుతమైన నటుడు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం. డియరెస్ట్ మక్బూల్.. నీవు ఎప్పటికీ మా హృదయాల్లో ఉండిపోతారు అని ఉర్మిలా మతోంద్కర్ ట్వీట్ చేశారు.

రవీనా టాండన్ ట్వీట్

అద్భుతమైన సహచర నటుడు. ప్రతిభకు మారుపేరు. అంతకంటే గొప్ప మానవతావాది. మీరు స్థానాన్ని ఎవరూ పూడ్చలేరు. మీరు ఇంత త్వరగా మాకు దూరం కావడం చాలా విషాదకరంగా ఉంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి అని రవీనా టాండన్ ట్వీట్ చేశారు.

కాజోల్ అజయ్ దేవగన్ ట్వీట్

ఇర్ఫాన్ ఖాన్ మరణ వార్తతో తీవ్ర విషాదంలో కూరుకుపోయాను. ఇలాంటి విషాద పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఆయన ఏ లోకాన ఉన్నా శాంతి చేకూరాలి అని కాజోల్ ట్వీట్ చేశారు.

బోమన్ ఇరానీ విషాదంతో

ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం గురించి తెలుసు కానీ.. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఇర్ఫాన్ మృతి వార్తను జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఓ మంచి నటుడిని మనం కోల్పోయాం. ఈ తరం నటీనటుల్లో ఇర్ఫాన్‌ను మించిన వారు లేరు. నటుడిగా ఆయన పేరు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం ఉంటుంది అని బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ట్వీట్ చేశారు.

ప్రీతి జింటా దిగ్రాంతి

భారతీయ సినిమా ప్రపంచంలోనే.. ప్రీతి జింటా
ఇర్ఫాన్ ఖాన్ మృతి వార్తతో తీవ్ర దిగ్రాంతికి గురయ్యాను. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన, విలక్షణ నటుడు. నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోయాను. నీవు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి కష్ట సమయాల్లో ఇర్ఫాన్ కుటుంబానికి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ప్రీతి జింటా ట్వీట్ చేశారు.

విషాదంలో మోహన్ లాల్..

ఇర్ఫాన్ ఖాన్ మరణవార్తతో హృదయం కలిచివేసింది. ఆయన ఇకలేరన్న వార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని విలక్షణ నటుడు మోహన్‌లాల్ ట్వీట్ చేశారు.

అనన్య పాండే దిగ్రాంతి

ఇర్ఫాన్ ఖాన్ ఆకస్మిక మృతిని నన్ను ఎంతో కలిచివేసింది. ఆ వార్తతో నేను విషాదంలో మునిగిపోయాను. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబానికి మానసిక స్థైర్యం ఇవ్వాలని కోరుకొంటున్నాను. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అని అనన్య పాండే ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X