ఇండస్ట్రీలో చాలా మంది హోమో సెక్సువల్స్ ఉన్నారు : నటి సంచలనం
స్వలింగ సంపర్కం వంటి వివాదాస్పద అంశాలు కలిగిన సెక్షన్ 377 దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. భారత శిక్షా స్మృతిలోని ఈ సెక్షన్ ప్రకారం ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. సెక్షన్ 377ను రద్దు చేసి, స్వలింగ సంపర్కానికి ఆమోదం పలకాలని ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ నటి మహికా శర్మ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

ఇండస్ట్రీలో చాలా మంది హోమో సెక్సువల్స్
సినీ రంగంలో చాలా మంది స్టార్స్ స్వలింగ సంపర్కులు ఉన్నారని, వారిలో కొందరు ఇండస్ట్రీని శాసిస్తున్న ప్రముఖులు ఉన్నారని, ఈ నేపథ్యంలో స్వలింగ సంపర్కానికి ఆమోద యోగ్యమైన పరిస్థితులు కల్పించాలని జరుగుతున్న ప్రయత్నాలకు తాను మద్దతిస్తున్నట్లు మహికా శర్మ తెలిపారు.

వారిలో సృజనాత్మకత ఎక్కువ
హోమో సెక్సువల్స్ చాలా మంచి వారని, వారిలో సృజనాత్మకత కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పింది.... అలాంటి వ్యక్తులకు తమకు నచ్చినట్లుగా శృంగార కార్యకలాపాలు నిర్వహించుకునేలా స్వేచ్ఛ ఇవ్వాలని మహికా శర్మ అభిప్రాయపడ్డారు.

ఐపీసీ సెక్షన్ 377 ఏమిటి?
ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు.

వివాదాలతో వార్తల్లో మహికా శర్మ
బాలీవుడ్లో మహికా శర్మ అంతగా పాపులారిటీ లేని నటి. అయితే పలు వివాదాస్పద అంశాలతో ఆమె ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మహారాష్ట్రలో ప్లాస్టిక్ మీద బ్యాన్ నేపథ్యంలో.... రాఖీ ప్రమోట్ చేస్తున్న బిబోయ్ కండోమ్ యాడ్‌కు సంబంధించిన ఫోటోను మహికా పోస్ట్ చేసి... ‘రాకీ సావంత్ అక్కయ్యా... ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కదా, ఆ లిస్టులో నువ్వు ప్రమోట్ చేస్తున్న కండోమ్స్ కూడా ఉన్నాయా? ' అంటూ కామెంట్ పెట్టింది. ‘కండోమ్స్ బ్యాన్ చేస్తే మహికా శర్మ లాంటి వారికి ఎయిడ్స్ వస్తుంది' అంటూ రాఖీ రిప్లై ఇవ్వడంతో వివాదానికి దారి తీసింది.


Click it and Unblock the Notifications











