Vivek Agnihotri: ‘అలాంటి వారి వాళ్ల ఎంతో మంది జీవితాలు నాశనం’: బాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
Vivek Agnihotri: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన 'ది కశ్మీర్ ఫైల్స్' బాలీవుడ్ ను షేక్ చేసింది. ఈ సినిమాపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సూపర్ హిట్ మూవీగా నిలిచి పలు రికార్డులను బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ డేరింగ్ డైరెక్టర్ తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఓ సెన్సెషనల్ ట్విట్ చేశారు. ఓ పొగరుబోతు మేనేజర్ వల్లే ఓ టాప్ యాక్టర్ ను తన మూవీ నుంచి తొలగించానని షాకింగ్ కామెంట్స్ పెట్టారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి . ఇంతకీ ఆ టాప్ యాక్టర్ ఎవరు? అసలేం జరిగింది?
ప్రముఖ దర్శకుడు, నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తెలియని మూవీ లవర్స్ ఉండరు. 2005లో క్రైమ్ థ్రిల్లర్ మూవీ'చాక్లెట్'తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన వివేక్ పలు ప్రముఖ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 'ది కశ్మీర్ ఫైల్స్' మూవీతో వివేక్ అగ్ని హోత్రికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఎన్నోఏళ్ల క్రితం కశ్మీరీ పండితులపై జరిగిన దాడుల ఆధారంగా చేసుకొని ఈ మూవీని రూపొందించారు. ఎన్నో వివాదాల మధ్య 2022లో ఈ మూవీ విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్ పరంగా కాసుల వర్షం కురిసింది. తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

చాలా మంది సినీ యాక్టర్ మేనేజర్ చాలా అహంకారంతో ఉన్నారని, వారి ప్రవర్తన సరికాదని డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. అలాంటి వారి వల్ల తన సినిమా నుంచి ఓ స్టార్ యాక్టర్ ను తొలగించాల్సి వచ్చిందన్నారు. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితిపై క్యాస్టింగ్ దర్శకుడు ముఖేశ్ స్పందిస్తూ.. 'ఒక నటుడు.. 200 కాస్టింగ్ డైరెక్టర్లు, 15,680 మంది మేనేజర్లు.. ప్రస్తుతం ఇండస్ట్రీ పరిస్థితి ఇలా ఉంది' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పై స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు.
'నేను గత వారం ఒక ప్రధాన నటుడిని తొలగించాల్సి వచ్చింది. దీనికి కారణం అతని మేనేజర్ చాలా అహంకారంతో వ్యవహరించారు. ఆ మేనేజర్ అలా వ్యవహరించడానికి అవకాశం ఉన్నందున అలా ప్రవర్తించాడు. ఆ మేనేజర్ పేరుపొందిన సెలబ్రిటీస్ స్టార్ కిడ్ టాలెంట్ ఏజెన్సీకి చెందిన ఉద్యోగి, ఇలాంటి మిడియేటర్స్ ఎంతోమంది జీవితాలు నిలబెట్టవలసింది పోయి..నాశనం చేస్తున్నారు. వర్క్‌షాప్ నిర్వహించి.. అలాంటి వారికి శిక్షణ ఇవ్వండి'' అని వివేక్ అగ్నిహోత్రి సూచించారు.
వివేక్ అగ్నిహోత్రి వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఢిల్లీ ఫైల్స్' మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో అతను తన X ఖాతాలో దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నాడు. ఢిల్లీ ఫైల్స్ సినిమా అనుకున్న సమయానికి ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్తుందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుంది. ఇందులో పెద్ద స్టార్స్ ఎవరూ లేకపోయినా కంటెంట్ సినిమాకు బలం. ఢిల్లీ ఫైల్స్ తన ఫైల్స్ సిరీస్‌లో చివరిది అని, అంతకంటే ముందు 'ది తాష్కెంట్ ఫైల్స్', 'ది కాశ్మీర్ ఫైల్స్' కూడా విడుదలయ్యాయని బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











