Salman Khan : క్యాన్సర్‌ను ఓడించిన 9 ఏళ్ల బాలుడు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హీరో ఇటీవల ప్రేక్షకుల ముందుకు టైగర్ 3 సినిమాతో వచ్చాడు. ఇక ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఆ విషయం పక్కన పెడితే... సల్మాన్ ఖాన్ ఇప్పుడు తన 9ఏళ్ల అభిమానిని కలుసుకున్నాడు. అసలు విషయం ఏంటో స్టోరీలో తెలుసుకుందాం.
సల్మాన్ ఖాన్ తన సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదిచుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ కండలవీరుడిగా సల్మాన్ ఖాన్ కు మంచి గుర్తింపు ఉంది. ఇక ఆయన తన సినిమాతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ టైగర్ 3 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం యష్ రాజ్ స్పై సినిమాటిక్ యూనివర్సల్ లో భాగంగా వచ్చింది.. కానీ ఆ సిినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇక ఈ సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ విషయం పక్కన పెడితే.. సల్మాన్ ఖఆన్... జగన్ బీర్ అనే ఓ 9 ఏళ్ల బాలుడిని కలుసుకున్నాడు. అసలు ఈ బాలుడిని సల్మాన్ ఖాన్ ఎందుకు కలిశారంటే... ఈ చిన్నారి క్యాన్సర్ బారీన పడ్డారు. తొమ్మిది రౌండ్ల కీమోథెరపీ తర్వాత క్యాన్సర్ ను జయించాడు జగన్ బీర్. సల్మాన్ 2018లో మొదటిసారిగా జగన్ బీర్ ను కలువగా.. అప్పుడు అతని వయసు 4 సంవత్సరాలు.
జగన్ బీర్ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ లో కీమోథెరపీ చేయించుకుంటున్నప్పుడు... ఆ సమయంలో సల్మాన్ కలిశాడు. విషయం తెలుసుకున్న సల్మాన్.. ఆ పిల్లాడికి దైర్యం చెప్పాడు. నువ్వు క్యాన్సర్ ను జయించు.. మళ్లీ నిన్ను కలుస్తాను అని మాట ఇచ్చాడు. ఇక ఈ కుర్రాడు 9 రౌడ్ల కీమో థెరపీ ద్వారా క్యాన్సర్ ను జయించాడు. దీంతో సల్మాన్ ఖాన్ కూడా ఇచ్చిన మాట ప్రకారం.. జగన్ బీర్ ను మళ్లీ కలిశాడు.
ఇక జగన్ బీర్ తల్లి సుఖ్ బీర్ మాట్లాడుతూ... మూడేళ్లవయసులో తన కొడుకు అకస్మాత్తుగా చూపును 90శాతం మేర కోల్పాయాడు. వైద్యులు అతని నుదిటిలో ఒక నాణెం-పరిమాణ క్యాన్సర్ కణితి ఉన్నట్లు నిర్దారించారు. అది నరాల మీద ఒత్తిడిని కలిగించడం వల్ల అతనికి అకస్మాత్తుగా దృష్టిలోపానికి దారితీసింది. చికిత్స కోసం ఢిల్లీ లేదా ముంబైకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విషయం కొడుక్కు ఎలా చెప్పాలో తెలియక... సల్మాన్‌ను కలవబోతున్నారని జగన్ బీర్ కు చెప్పారు.

ఇక ఆసుపత్రిలో చేరిన జగన్ బీర్.. సల్మాన్ ఖాన్ ను కలవాలని ఆశించాడు. అందుకోసం ఓ వీడియోను రూపొందించగా.. అది సల్మాన్ ఖాన్ వద్దకు చేరింది. దీంతో సల్మాన్ జగన్‌బీర్‌ను కలవడానికి వచ్చాడు. చూపు కోల్పోయిన జగన్ బీర్... సల్మాన్ ఖాన్ తాకి.. అతని ఉనికిని గమనించాడు. ఇక అప్పుడు జగన్ బీర్ వద్ద సల్మాన్ మాట తీసుకోగా.. ఈరోజు జగన్ బీర్ క్యాన్సర్ ను జయించాడు. దీంతో మళ్లీ సల్మాన్ ఆ కుర్రాడిని కలిచి... తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం జగన్ బీర్ స్కూలుకు వెళ్తున్నట్లు తల్లి చెప్పుకువచ్చింది.


Click it and Unblock the Notifications











