పెళ్లికాకుండానే సల్మాన్ ఖాన్ తండ్రి .. కన్నబిడ్డ కోసం కండలవీరుడు..!
Recommended Video
దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్. 53 ఏళ్లు దాటినా ఇంకా బ్రహ్మాచారిగానే సుపరిచితులు. అలాంటి వ్యక్తి తండ్రి అయ్యాడా అని ఆలోచిస్తున్నారా? మీరు చూసిన వార్త నిజం కాకపోయినా.. అలాంటి ప్రయత్నం కోసం అడుగులు వేస్తున్నాడట. సల్మాన్ కృత్రిమ గర్భధారణ (సరోగసి) ద్వారా తండ్రిగా మారబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మంచు లక్ష్మీ, షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్, ఏక్తా కపూర్ లాంటి పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తల్లిదండ్రులగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సల్మాన్ ఖాన్ తండ్రి కాబోతున్నారనే వార్త మీడియాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..

అమీర్ ఖాన్, కరణ్ జోహార్ మాదిరిగానే
సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. సరోగసి ద్వారా పిల్లల్ని కనేందుకు ప్రయత్నిస్తున్నారు. షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కరణ్ జోహర్, ఏక్తా కపూర్ మాదిరిగా సరోగసికి ప్రయత్నిస్తున్నారు. ఇక జీవితంలో పెళ్లి చేసుకోకూడదనే డిసైడ్ కావడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకొంటున్నట్టు తెలిసింది.

పిల్లలంటే సల్మాన్ ఖాన్‌కు
సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే ఇష్టం. తన అల్లుళ్లు, మేన కోడల్లు అంటే చాలా ఇష్టం. వారితో గడపడం అన్నా.. వారితో వెకేషన్‌కు వెళ్లడమన్నా చాలా ఆసక్తి చూపుతారు. ఆ క్రమంలో సొంతంగా తనకంటూ ఓ బిడ్డ ఉంటే బాగుంటుందనే నిర్ణయానికి సల్మాన్ ఖాన్ వచ్చాడట. అందుకు సంబంధించిన చర్యలకు గురించి వైద్యులు, సన్నిహితులతో చర్చించుస్తున్నారట.

అప్పటికి 20 ఏళ్ల బిడ్డ ఉంటాడు
గతంలో కూడా సల్మాన్ ఖాన్ తన పెళ్లి, పిల్లల గురించి చాలా ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాకు పెళ్లిపై ఇష్టం లేదు. కానీ పెళ్లంటూ చేసుకొంటే కేవలం పిల్లల కోసమే చేసుకొంటానేమో అని సల్మాన్ చెప్పారు. తన 50వ జన్మదినం సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. ఇప్పుడు పిల్లల్ని కన్నా.. నాకు 70 ఏళ్లు వచ్చే సరికి 20 ఏళ్ల కొడుకు ఉంటాడు అని అన్నారు.

నా తల్లిదండ్రుల కోసమే
వచ్చే రెండు, మూడు ఏళ్లలో నేను పిల్లలు కనడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నా పిల్లల్ని చూసి హ్యాపీగా ఉండాలి. వారు నా పిల్లల్ని ముద్దు మురిపెం చేయాలి. ఒకవేళ నేను పిల్లల్ని కంటే కనీసం నలుగురు బిడ్డల్ని కంటాను. పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనడం చాలా కష్టమే. కానీ ఎలాగోలా మేనేజ్ చేస్తాను. అప్పుడు పెళ్లి చేసుకోవడానికి వయసు చాలలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వయసు దాటిపోయింది అంటూ సల్మాన్ సెటైర్లు వేసుకోవడం మనకు తెలిసిందే.


Click it and Unblock the Notifications











