కత్రినా కైఫ్ ‘షీలా కీ జవానీ’ సాంగ్.. తెరవెనుక కథ తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లోనూ కొన్ని చిత్రాల్లో నటించి ఇక్కడి ఆడియెన్స్ గుండెలను దోచుకుంది. ఇక్కడ దక్కించుకున్న క్రేజ్ తోపాటు తన అందం, టాలెంట్ తో బాలీవుడ్ లో మంచి ఆఫర్లను అందుకుంది. దాంతో వెంటనే అక్కడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ గానే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే కత్రినా కైఫ్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులకు గుర్తుకొచ్చే సాంగ్ 'షీలా కీ జవానీ'. ఆ సాంగ్ తోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది. కాగా ఈ పాట గురించి తాజాగా డైరెక్టర్ ఫర్హా ఖాన్ ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

కత్రినా కైఫ్ ఫ్యామిలీ వివరాలు..
కత్రినా కైఫ్ హంకాంగ్ లో జన్మించింది. బ్రిటీష్ సంతతికి చెందిది. కాశ్మీరీకి చెందిన వ్యాపార వేత్త మహ్మద్ కైఫ్ - లాయర్ సుజన్నీ దంపతుల కూతురు. జూలై 13, 1983లో పుట్టింది. ఇక 18 ఏళ్లలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టింది. 2003 నుంచి వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. హిందీతో పాటు తెలుగులోనూ రెండు చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా కత్రినా కైఫ్ తన కెరీయర్ లోనే 2004లో విక్టరీ వెంకటేశ్ సరసన మల్లీశ్వరీ చిత్రంలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ అల్లరి పిడుగు చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఇక హిందీ చిత్రాల్లోనే నటిస్తూ వచ్చింది. తన నటించిన చిత్రాలు, సాంగ్స్ తెలుగు ఆడియెన్స్ వరకు వచ్చాయి.

Bollywood Heroine Katrina Kaif Sheela ki Jawani Song Back story

కత్రినా కైఫ్.. షీలా కీ జవానీ..
కత్రినా తెలుగు రెండు చిత్రాల్లో నటించినప్పటికీ.. కత్రినాకు మాత్రం 'షీలా కీ జవానీ' సాంగ్ తోనే సౌత్ లో విపరీతమైన క్రేజ్ దక్కింది. సౌత్ లో ప్రతి ఒక్కరి నోట పలికిన పాట అది. భాష ఏదైనా ట్యూన్ నచ్చితే ఆడియెన్స్ ఎంతలా హిట్ చేస్తారో తెలిసిందే. అయితే ఆ సాంగ్ 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రంలోనిది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ - కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రమిది. ఫర్హా ఖాన్ దర్శకత్వం వహించారు. 2010లో ఈ చిత్రం విడుదలైంది. అయితే ఈ సినిమాలో ఎంతగానో హిట్ సాంగ్ ఇది. ఈ పాట వెనకాల ఓ స్టోరీ ఉంది.

తాజాగా దర్శకురాలు ఫర్హా ఖాన్ ఆ పాట వెనకాల ఉన్న చిన్న బ్యాక్ స్టోరీని చెప్పుకొచ్చారు. ఆ సాంగ్ ను చిత్రీకరించినప్పుడు పెద్దగా ఎలాంటి రిస్క్ చేయలేదని, పెద్దగా ఖర్చు కూడా పెట్టలేదని చెప్పారు. కేవలం పది మంది డ్యాన్సర్లతో చిన్న క్లోజ్డ్ ఏరియాలో చిత్రీకరించినట్టు తెలిపారు. బాలీవుడ్ లోనే నిర్మించిన అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మించిన పాట ఏదైనా ఉందంటే అది షీలా కీ జవానీ సాంగ్ అని చెప్పుకొచ్చింది. కానీ ఆ సాంగ్ ఎంతో పెద్ద హిట్ అయ్యిందని, కొరియోగ్రఫీ కూడా సక్సెస్ అయ్యిందని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికీ యూట్యూబ్ లో 380 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. విశాల్ శేఖర్ సంగీతం అందించారు.

కత్రినా కైఫ్ పెళ్లి.. సినిమాలకు దూరం
కత్రినా కైఫ్ బాలీవుడ్ లో ప్రముఖ స్టార్స్ తో కొన్నాళ్ల పాటు డీప్ రిలేషన్ షిప్ లో ఉందని అప్పట్లో టాక్. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ విక్కీ కౌషల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2021 డిసెంబర్ 9న ఈ వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇక విక్కీ కౌషల్ రీసెంట్ గా 'ఛావా' అనే చిత్రంతో భారీ హిట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక కత్రినా కైఫ్ పెళ్లి తర్వాత నుంచి సినిమాల జోరును తగ్గించింది. తనకు కంఫర్ట్ గా ఉన్న చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. చివరిగా మేరీ క్రిస్టమస్ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X