Shilpa Shetty: భర్తపైకే చెప్పు విసిరిన శిల్పా శెట్టి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. అలాగే ఆమె భర్త రాజ్ కుంద్రా కూడా అందరికీ సుపరిచితమే. ఇన్నాళ్లు బిజినెస్ మేన్ గా మాత్రమే ఉన్న రాజ్ కుంద్రా హీరోగా మారబోతున్నారు. యూటీ 69 సినిమా ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయితే ఆయన మొదటి సినిమాను షానవాజ్ అలీ తెరకెక్కించగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ముంబయిలో జరిగింది. ఇందులో పాల్గొన్న రాజ్ కుంద్రా యూటీ 69 ఎలా మొదలైందో చెప్పాడు. ముఖ్యంగా తన భార్య శిల్పా శెట్టి గురించి కూడా చెప్పారు.
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా మధ్య ఉన్న బంధం గురించి వివరించారు. తాను నటుడిగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అదే విషయాన్ని తన భార్య శిల్పా శెట్టికి చెప్పానని రాజ్ కుంద్రా వెల్లడించారు. కానీ అప్పుడు శిల్పా శెట్టి ఇచ్చిన రియాక్షన్ చూసి షాకయ్యారట రాజ్ కుంద్రా. ఆమెను ఒప్పించడానికి కూడా చాలానే సమయం పట్టిందని తెలిపారు. జీవితంలో తాను ఎదుర్కున్న సమస్యలను, కష్టాలను ఆధారంగా చేసుకని యూటీ 69 సినిమాను తెరకెక్కించినట్లు స్పష్టం చేశారు.

సినిమా చేస్తానని చెప్పగానే చెప్పు విసిరిన శిల్పాశెట్టి: యూటీ 69 చిత్రంలో తానే నటించాలని నిర్ణయించుకున్నట్లు.. శిల్పా శెట్టికి చెప్పిన రోజును తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. ఆరోజు శిల్పాకు కాస్త దూరంగా ఉండి, తానొక సినిమా చేయాలనుకుంటున్నానని అన్నారట. అలాగే స్క్రిప్టు కూడా తన దగ్గర ఉందని చెప్పగా... శిల్పా శెట్టి ఏమీ మాట్లాడకుండా చెప్పు తీసి భర్తపైకి విసరిందట. శిల్పా అలా చేయడం చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని.. ఏం మాట్లాడాలో కూడా తెలియక చాలా సేపు అలాగే ఉండిపోయాయని వెల్లడించారు. కానీ ఆ తర్వాత డైరెక్టర్ షానవాజ్ అలీ.. ఇంటికి వచ్చి శిల్పాశెట్టి కథ చెప్పగా ఆమె ఒప్పుకున్నట్లు తెలిపారు.
సినిమా కథ తెలిసాకే ఓకే చెప్పిన శిల్పాశెట్టి: మానవ సంబంధాలపై ఈ సినిమా ఉండబోతుందని ఆమెకు అర్థం కావడం వల్లే తాను నటిస్తానంటే ఒప్పుకుందని రాజ్ కుంద్రా పేర్కొన్నారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఈ సినిమా విషయంలో శిల్పా శెట్టి తనకు సపోర్టింగ్ గా నిలిచిందని చెప్పారు. అలాగే ప్రతిరోజూ అంతా ఓకేనా, యాక్టింగ్ చేయగలవా అంటూ అడిగేదని.. తన రియాక్షన్ చూశాకే ఆమె కాస్త ధైర్యం తెచ్చుకునేదని అన్నారు.

అయితే బ్లూ ఫిల్మ్ కేసులో 2021లో రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యారు. ఆరు నెలల పాటు జైల్లోనే ఉన్నారు. ఆ సమయంలో శిల్పా శెట్టి చాలా నిరాశ పడిపోయారు. తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూనే.. ఆయనను బయటకు తీసుకు వచ్చేందుకు చాలా ప్రయత్నించారు. అయితే జైల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆ కేసు తనపై ఉన్నన్ని రోజులు తాను మానసిక సంఘర్షణకు లోనయ్యాయని రాజ్ కుంద్రా వెల్లడించారు. దీన్నే ప్రస్తుతం యూటీ 69 చిత్రంలో చూపించబోతున్నారు. ఈ సినిమా చూస్తే అసలు ఏం జరగిందో పూర్తిగా తెలుస్తుందని అంతా భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











