twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్లామర్‌కు దూరంగా.. పాత్రల కోసం దిగొచ్చిన స్టార్స్

    |

    సినీ తారలంటేనే గ్లామర్‌గా, అందంగా ఉండాలని ఓ అభిప్రాయానికి వచ్చేసి ఉంటారు జనాలు. నలుపు, లావు, బక్కపల్చగా ఉన్నా వారిని తెరపై స్టార్స్‌గా గుర్తించరు. తెల్లగా ఉండి, కండలు తిరిగిన దేహం, జీరో సైజ్ మెయింటెన్ చేస్తేనే వారిని హీరో హీరోయిన్లుగా కీర్తిస్తుంటారు. కానీ ప్రస్తుతం కాలం మారుతోంది. దీంతో పాటు జనాలు చూసే దృక్పథం కూడా మారుతూ వస్తోంది. పాత్రల కోసం స్టార్ హీరోలు డీ గ్లామర్‌గా కనిపిస్తున్నారు.

    గ్లామర్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే బాలీవుడ్‌లోనూ డీ గ్లామర్ రోల్స్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. దక్షిణాదిన ఇటువంటి సినిమాలు, ఇటువంటి పాత్రలు కోకోల్లలుగా వచ్చినా.. బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. వాటికి నిదర్శనమే సూపర్ 30, గల్లీ బాయ్ చిత్రాలు. ఈ సినిమాల్లో హీరోలు పూర్తిగా డీ గ్లామర్ రోల్స్ పోషించారు. అయినా ఈ చిత్రాలు మంచి విజయాన్ని నమోదు చేశాయి.

    Bollywood Is Also Looking for Brownface

    మొదటగా హృతిక్ రోషన్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అందరూ షాక్‌ అయ్యారు. అదే విధంగా భూమీ ఫెడ్నేకర్ నటించిన బాలా చిత్రంలోనూ ఆమె డీ గ్లామర్ రోల్‌ను పోషించింది. ఇక గల్లీ బాయ్ చిత్ర విషయానికొస్తే.. రణ్‌వీర్, అలియా ఇద్దరూ మేకప్‌కు ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే ఈ చిత్రాలకు అవార్డలు పంట పండింది. కథలో దమ్ము ఉండాలని, గ్లామర్ కాదని నిరూపించాయి. దక్షిణాది చిత్రాల్లో రా లుక్, సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలు, కథలు ఎక్కువగా వస్తుంటాయి.

    English summary
    Bollywood Is Also Looking for Brownface. Bollywood may be best known for its glamorous casts, glitzy costumes and energetic dance routines. But it also has a far less flattering reputation -- for promoting the offensive practice of brownface.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X