Laal Singh Chaddha: టాలీవుడ్ అగ్ర హీరోలకు దర్శకులకు అమీర్ ఖాన్ స్పెషల్ షో.. ఫొటో వైరల్
బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమిర్ ఖాన్ నుంచి దాదాపు నాలుగేళ్ళ అనంతరం వస్తున్న సినిమా కావడంతో ఓ వర్గం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ స్టార్ హీరో నుంచి చివరగా 2018లో థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ మిస్టర్ పర్ఫెప్ట్ మరో కథను ఫైనల్ చేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు. గత ఏడాది కృనల్ కపూర్ 'కోయి జనేనా' అనే సినిమాలో ఒక గెస్ట్ రోల్ లో మాత్రమే దర్శనమిచ్చారు.
ఇక ఇప్పుడు విభిన్నమైన కాన్సెప్ట్ లో తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11 న విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో చిత్ర యూనిట్ సభ్యులు చాలా బిజీగా ఉన్నారు. గత నెల రోజులుగా ఆమిర్ ఖాన్ వివిధ రాష్ట్రాల్లో సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్ టాలీవుడ్ టాప్ సెలబ్రెటీలకు ప్రత్యేకంగా ఒక షో వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఇక గత వారం హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా స్పెషల్ షోను ప్రదర్శించిన అమీర్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొందరికి లాల్ సింగ్ చద్దా సినిమాను చూపించడం జరిగింది. స్పెషల్ షో చూసేందుకు అక్కినేని నాగార్జున, దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి అలాగే పుష్ప దర్శకుడు సుకుమార్ కూడా స్పెషల్ స్క్రీనింగ్ లో పాల్గొన్నారు. ఇక సినిమా చూసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి అమీర్ ఖాన్ కు ప్రత్యేకంగా ప్రశంసలు అందించినట్లు తెలుస్తోంది. ఇక మరొక ఎమోషనల్ క్యారెక్టర్ చేసిన నాగచైతన్య ను కూడా మెగాస్టార్ ఎంతగానో మెచ్చుకున్నట్లు సమాచారం. రాజమౌళి, నాగార్జున, సుకుమార్ కూడా అమీర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాను సీక్రెట్ సూపర్ స్టార్ డైరెక్టర్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేశారు. మరి సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











