Dharmendra: విషమంగానే ధర్మేంద్ర ఆరోగ్యం.. వెంటిలేటర్‌పై చికిత్స
Dharmendra: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషమంగానే ఉంది. దీంతో ఆయనకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. అక్టోబర్ 11వ తేదీన ధర్మేంద్ర మరణించినట్లుగా వార్తలు రాగా.. వాటిని ఆయన కుమార్తె ఈశా డియోల్ ఖండించారు. నాన్న గారు క్షేమంగానే ఉన్నారని, ఆయనకు చికిత్స కొనసాగుతోందని డియోల్ కుటుంబం నుంచి అధికారికంగా వచ్చే ప్రకటననే పరిగణనలోనికి తీసుకోవాలని, మీడియాలో వచ్చే రూమర్స్‌ని ప్రజలు నమ్మొద్దని ఈశా డియోల్ చెప్పారు.
అదే విధంగా హేమమాలిని కూడా ఈ రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం చాలా బాధాకరం. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యక్తి గురించి ఇలా అవాస్తవాలు చెప్పడం మానవత్వానికి విరుద్ధం. మా కుటుంబానికి గౌరవం ఇవ్వండి, కొంత ప్రైవసీ ఇవ్వండి" అంటూ ట్వీట్ చేశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్ర ఆస్పత్రిలో ఉండగా, ఆయన టీమ్ కూడా "అయన బాగానే ఉన్నారు" అని అధికారిక ప్రకటన ఇచ్చింది. కానీ ఉదయం వచ్చిన పుకార్లు నెటిజన్లలో గందరగోళం రేపాయి.
1958లో బీ తేరా హామ్ బీ తేరే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు ధర్మేంద్ర. తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో 300కి పైగా చిత్రాల్లో నటించారు. షోలే, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, సీతా ఔర్ గీతా, యాదోన్ కీ బారాత్, ఫూల్ ఔర్ పత్తర్, ఆఖేన్ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచాయి. యాక్షన్ రోల్స్, డైలాగ్ డెలివరీ, మనసుకు హత్తుకునే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ లెజండరీ నటుడు ధర్మేంద్రను అభిమానులు "హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్" అని పిలిచేవారు.

1935 డిసెంబర్ 8న పంజాబ్‌లోని లుధియానా జిల్లా సన్రాలి గ్రామంలో జన్మించిన ఆయన అసలు పేరు ధర్మేంద్ర సింగ్ డియోల్. సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆయన సినీరంగంలో తన కష్టపడి స్టార్‌డమ్ అందుకున్నారు. బాలీవుడ్‌లో స్థిరమైన స్థానాన్ని సంపాదించిన ఆయన తర్వాత రాజకీయ రంగంలోనూ అడుగుపెట్టారు. 2004లో రాజస్థాన్‌లోని బికనీర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ధర్మేంద్ర భార్య ప్రముఖ నటి హేమామాలిని, కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ ఇద్దరూ బాలీవుడ్ హీరోలుగా రాణిస్తున్నారు. హేమామాలినితో వివాహానంతరం వారికి ఈశా డియోల్, అహానా డియోల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ధర్మేంద్ర అనేక పురస్కారాలు అందుకున్నారు. 1997లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, 2012లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ పురస్కారం లభించాయి.


Click it and Unblock the Notifications











