twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నటుడు రిషి కపూర్ కన్నుమూత.. బాలీవుడ్‌లో మరో విషాదం...!

    |

    80వ దశకంలో ప్రేమ కథా చిత్రాలతో, లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ప్రముఖ నటుడు రిషీ కపూర్ ఇకలేరు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధి బాధపడుతున్న ఆయన ముంబైలోని హస్పిటల్‌‌లో మరణించారు. రిషి ఆరోగ్యం విషమించడంతో ఆయనను బుధవారం రాత్రి ముంబైలోని సర్ హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

    Recommended Video

    Rishi Kapoor Passes Away at 67 In Mumbai’s HN Reliance Foundation Hospital
    రిషి కపూర్ వ్యక్తిగత జీవితం

    రిషి కపూర్ వ్యక్తిగత జీవితం

    రిషి కపూర్ వయసు 67 సంవత్సరాలు. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత స్వర్గీయ రాజ్ కపూర్‌ తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుత బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ తండ్రిగా సుపరిచితుడు. ఆయనకు భార్య నీతూ కపూర్, రిధిమా కపూర్, రణ్‌బీర్ కపూర్ సంతానం ఉన్నారు. రషి బొంబాయిలోని చెంబూరులో 1952 సెప్టెంబర్ 4న జన్మించారు.

    సినీ కెరీర్ ఇలా

    సినీ కెరీర్ ఇలా

    తండ్రి రాజ్‌కపూర్ రూపొందించిన శ్రీ 420 చిత్రం ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలోని ప్యార్ హువా, ఇక్రారర్ హువా అనే పాటలో కనిపించడం ద్వారా ఆయన సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత మేరా నామ్ జోకర్ చిత్రం ద్వారా పూర్తి స్థాయి నటుడిగా మారారు.

    రిషీ నటించిన చిత్రాలు

    రిషీ నటించిన చిత్రాలు

    రిషీ కపూర్ నటించిన బాబీ, లైలా మజ్నూ, రాఫూచక్కర్, స్వర్గం, కర్జ్, ప్రేమ్ రోగ్, నగీనా, హనీమూన్, చాందినీ, హీనా, బోల్ రాధా బోల్, కబీ కబీ, హమ్ కిసీ సే కమ్ నహీ, అజూబా లాంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన జీవిత కథ ఖుల్లం ఖుల్లం మంచి ప్రేక్షకాదరణ పొందింది.

    క్యాన్సర్ వ్యాధితో బాధపడతుూ..

    క్యాన్సర్ వ్యాధితో బాధపడతుూ..

    రిషీ కపూర్ 2018లో క్యాన్సర్ వ్యాధిన పడ్డారు. దాంతో ఆయనను యూఎస్‌లోని ఆస్పత్రిలో చికిత్స జరిపించారు. అనంతరం కోలుకొన్న ఆయన ఈ గతేడాది చివర్లలో స్వదేశానికి తిరిగి వచ్చారు. కొద్దిరోజులుగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆయన లాక్‌డౌన్ పిరియడ్‌లో అస్వస్థతకు లోనయ్యారు. తాజాగా ఆయన ముంబైలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

    English summary
    Bollywood legend Rishi Kapoor no more, Passes away with Cancer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X