ఆఫర్ ఇస్తానని వాడుకొన్నారు.. రేప్ చేసి హింసించారు.. మోడల్ సంచలన ఆరోపణలు
సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అంశం కలకలం రేపుతూనే ఉంది. ఇప్పటికే తాము లైంగిక వేధింపుల బారిన పడ్డామని చాలా మంది నటీమణులు మీటూ పేరిట ఉద్యమం కూడా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక మాజీ మోడల్ ఏకంగా బాలీవుడ్ కి చెందిన తొమ్మిది మంది మీద లైంగిక వేధింపులు, రేప్ కి సంబంధించిన కేసులు పెట్టడం సంచలనంగా మారింది.
బాలీవుడ్ కి చెందిన తొమ్మిది మంది మీద 28 ఏళ్ల మాజీ మోడల్ బాంద్రా పోలీస్ స్టేషన్ లో అత్యాచారం మరియు లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదు చేసింది. నటుడు-నిర్మాత జాకీ భగ్నాని, ఫోటోగ్రాఫర్ కోల్స్టన్ జూలియన్, టాలెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ క్వాన్ ఎంటర్టైన్మెంట్ వ్యవస్థాపకుడు అనిర్బన్ బ్లా మరియు టి-సిరీస్ కంపెనీకి చెందిన క్రిషన్ కుమార్ పేరిట ఈ కేసు నమోదయింది. తనకు నటించే అవకాశాలు ఇస్తామనే నెపంతో 2014 నుంచి 2019 మధ్య కాలంలో వారంతా లైంగిక వేధింపులు జరిపారని మోడల్ పేర్కొంది. మోడల్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

సెక్షన్ 376 (పదేపదే అత్యాచారానికి పాల్పడటం) అలాగే ఐపీసీ సెక్షన్ 354 (లైంగిక వేధింపులు) చట్టాల కింద నమోదు చేశారు. వారు మాత్రమే కాక ఎఫ్ఐఆర్‌లో నిఖిల్ కామత్, షీల్ గుప్తా, గురు జ్యోత్ సింగ్, కృష్ణ కుమార్ లాంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే తొమ్మిది మందిలో కొంతమందికి తెలుగు సినిమా పరిశ్రమతో కూడా సంబంధాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక వారిలో కొందరు స్పందిస్తూ ఆమె తమని కావాలనే బ్లాక్ మెయిల్ చేస్తుందని ఆరోపించారు. తమ మీద చేసిన ఆరోపణలు అబద్ధం అని అవి, ప్రేరేపించబడినవి అని వారు చెబుతున్నారు. ఆమె బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించిందని ఆ ప్రయత్నాలు విఫలమైన కారణంగానే ఆమె నిరాధారమైన ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని పేర్కొన్నారు. మరి ఈ అంశం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి మరి.


Click it and Unblock the Notifications











