August 15th Releases: తమన్నా భాటియా ఘాటు అందాలతో.. పంద్రాగస్టు రోజున మిల్కీ బ్యూటీదే జోరు!

దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన అపూర్వదినం ఆగస్టు 15 భారతీయులందరికి చిరస్మరణీయం. ఈ పంద్రాగస్టు రోజు సెలవు దినం కావడం బాలీవుడ్ సినిమాకు కలిసి వచ్చిన అంశంగా మారింది. గురువారం సెలవు దినం కావడంతో శని, ఆదివారాలు, సోమవారం, ఇదే వారంలో రాఖీ పండగ కూడా రావడంతో లాంగ్ వీకెట్‌గా మారింది. దాంతో సెలవు దినాలను క్యాష్ చేసుకోవడానికి అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, రాజ్ కుమార్ రావు, శ్రద్దాకపూర్ తమ సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ సినిమాల్లో తమన్నా భాటియా తన అందాలను గుప్పించేందుకు సిద్దం కావడం మరో అంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లోనూ ఈ వారం హాట్ బ్యూటీ తన గ్లామర్ షో తో పుల్ ఎంటర్టైన్మెంట్ పంచడానికి వస్తున్నారు. ఈ ఏడాది వరుస ఫెయిల్యూర్ తో సతమతమతున్న బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌. ఆ ఫెయిల్యూర్ నుండి కామ్ బ్యాక్ అవుదామని ఖిలాడీ అక్షయ్ కుమార్ మరో కొత్త సినిమాతో ముందుకు వస్తున్నాడు. ఆ సినిమానే 'ఖేల్ ఖేల్ మే'మూవీ. మల్టీ స్టారర్ మూవీ ఆగస్ట్ 15న విడుదల కానున్నది.

Bollywood Movie Releases on August 15th Tamannaah Bhatia to sizzle on Independance day 2024 celebrations

ఖేల్ ఖేల్ మే చిత్రంలో అక్షయ్ కుమార్ - వాణీ కపూర్, ఆమ్మీ వీర్క్ - తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, ఆదిత్య సీల్ - ప్రగ్యా జైస్వాల్.. ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. ముదాస్సర్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఫ్యామిలీ ఎంటర్టైన్ గా వస్తున్న ఈ మూవీ.. అల్ మిక్స్ .. కాక్ టెల్ గా రానున్నది.

బాలీవుడ్ లో ఈ వారమే మరో మూవీ కూడా విడుదల కానున్నది. బాలీవుడ్ స్టార్స్ రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం స్త్రీ.. ఐదేళ్ల కిందట హిందీలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు చేసింది. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ దాదాపు రూ. 180 కోట్లు రాబట్టింది. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది.

Bollywood Movie Releases on August 15th Tamannaah Bhatia to sizzle on Independance day 2024 celebrations

స్త్రీ 2 మూవీలో రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న స్త్రీ 2 సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అలా ఈ వారం రిలీజ్ అవుతున్న దాదాపు అన్ని సినిమాల్లో శ్రద్దాతోపాటు తమన్నా భాటియా హాట్ హాట్ హీరోయిన్స్ నటిస్తున్నారు. వారి గ్లామర్ షోతో మూవీ లవర్స్ కు పుల్ మీల్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ పక్కా అంటున్నారు. ఇప్పటికే తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది.

అలాగే ఇదే వారం జాన్ అబ్రహం నటించిన వేద మూవీ కూడా రిలీజ్ కానున్నది. వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్, డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించగా.. జీ స్టూడియోస్ నిర్మించింది. ఈ చిత్రంలో యువ హీరోయిన్ శర్వారీ హాట్ హాట్‌గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X