బాలీవుడ్ సూపర్‌స్టార్‌తో కోలీవుడ్ సెన్షేషన్ డైరెక్టర్...రేర్ కాంబో సెట్ చేసిన మైత్రి, నిజమైతే

సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒకదాని వెంట మరో సినిమా వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాది సినిమాల మాదిరిగానే అక్కడివాళ్లు కమర్షియల్ మూవీస్ తీస్తే జనం కర్రు కాల్చి వాతపెట్టారు. దీంతో ఏ సినిమా తీయాలో, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ పెట్టాలో తెలియక హిందీ మేకర్స్ తలపట్టుకుంటున్నారు. అసలు ఈ తలనొప్పి దేనికీ సౌత్ నుంచే టెక్నీషియన్స్‌ని, నటీనటులను తెచ్చుకుంటే పోలా అని డిసైడ్ అయ్యారు.

ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ అట్లీకి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నుంచి పిలుపొచ్చింది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీయే జవాన్. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.1148 కోట్ల వసూళ్లను సాధించి బాలీవుడ్‌ను మళ్లీ నిలబెట్టింది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగిబాబు, రవీంద్ర విజయ్ వంటి సౌత్ యాక్టర్స్ నటించగా.. దక్షిణాదికే చెందిన అనిరుధ్ మ్యూజిక్ అందించారు.

bollywood mr perfect Aamir Khan to lead Lokesh Kanagaraj s next pan-India project

సౌత్ ఫార్ములాతో షారుఖ్ హిట్ కొట్టడం చూసిన హిందీ జనాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. గతేడాది టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సైతం తమిళ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్‌తో సికిందర్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా చేరారు. అప్పుడెప్పుడో దంగల్ తర్వాత ఆయన తన రేంజ్‌కి తగ్గ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. అందుకే తన మార్క్ చూపించాలని అమీర్ భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే ఆయన కూడా ఓ తమిళ డైరెక్టర్‌తో జత కట్టాడు. అతనెవరో కాదు.. లోకేష్ కనగరాజ్. ఇప్పటికే ఖైదీ, విక్రమ్‌లతో బాక్సాఫీస్ దుమ్ముదులిపిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కూలీ తెరకెక్కిస్తున్నారు లోకేష్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే అమీర్ ఖాన్‌ను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తాడని ఫిలింనగర్ టాక్.

ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తోందని సమాచారం. ఇప్పటికే లోకేష్ కథను సిద్ధం చేశాడని.. స్క్రిప్ట్ ఫైనల్ అయిన వెంటనే అఫిషీయల్‌గా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తారని సమాచారం. హిందీ హీరో, తమిళ దర్శకుడు, తెలుగు నిర్మాత ఈ అరుదైన కాంబినేషన్ ఇది కనుక సెట్ అయితే మామూలుగా ఉండదు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే మైత్రీ మూవీ మేకర్స్ స్పందించాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X