సోనాక్షి సిన్హాపై కేసు.. ముఖం చాటేయడంతో అభిమానుల దాడి.. భారీ నష్టం
అసలే అవకాశాలు లేక సతమతమవుతున్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈవెంట్‌లో పాల్గొంటానని మాట తప్పినందుకు గానూ సోనాక్షి, మరో ఐదుగురిపై ఢిల్లీలో కేసు నమోదైంది. సోనాక్షి తీరు వల్ల తాము ఆర్థికంగాను, మానసికంగా నష్టపోయామని, అందుకు నష్టపరిహారం చెల్లించాలని ఈవెంట్ నిర్వాహకులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే..

ఈవెంట్‌కు వస్తానని చెప్పి గైర్హాజరు
ఢిల్లీలో సెప్టెంబర్ 30న జరిగే ఈవెంట్‌లో సోనాక్షి సిన్హా పాల్గొంటానని అంగీకరించింది. ఆమె సమ్మతి తెలియజేయడంతో అందుకు తగిన ఏర్పాటు చేసుకొన్నాం. ఈవెంట్ రోజున సోనాక్షి హ్యాండిచ్చింది. దాంతో తాము, ఆడియెన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యాం అని నిర్వాహకులు వెల్లడించారు.

అభిమానుల దాడి, ఫర్నీచర్ ధ్వంసం
సోనాక్షి సిన్హా ఈవెంట్‌కు గైర్హాజరు కావడంతో ఆడియెన్స్ బీభత్సం సృష్టించారు. వేదిక వద్ద నానా హంగామా చేయడంతో ఫర్నీచర్, కుర్చీలు ధ్వంసమయ్యాయి. దాంతో మాకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరగింది. అంతేకాకుండా మా సంస్థకు ఉన్న పరువు గంగలో కలిసింది అని నిర్వాహకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

రూ.37 లక్షల పారితోషికం
ఢిల్లీ ఈవెంట్‌కు హాజరవుతానని అంగీకారం తెలిపారు. అందుకోసం రూ.37 లక్షలు పారితోషికంగా అడిగారు. అడ్వాన్సుగా 28 లక్షలు తీసుకొన్నారు. చివరి నిమిషంలో ఈవెంట్‌కు ముఖం చాటేశారు. దాంతో ఈవెంట్ గందరగోళంగా మారింది. ఈవెంట్ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసిన మొత్తం తమను నష్టాలకు గురిచేసింది అని నిర్వాహకుడు ప్రమోద్ శర్మ వెల్లడించారు.

చీటింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు
ఈవెంట్ కోసం అదనంగా రూ.9 లక్షలు ఖర్చు చేశాను. ఆఖరి నిమిషంలో తాను రావడం లేదని చెప్పడంతో ఆమెను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించాం. కానీ ఆమె ససేమిరా అన్నారు. దాంతో మాకు భారీ నష్టాలు వచ్చాయి. దాంతో మొరాదాబాద్ డీఎస్పీని కలిసి ఫిర్యాదు అందజేశాం. ఆయన చీటింగ్ కేసుతోపాటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు దశలో ఉంది అని నిర్వాహకులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











