For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేశాడు.. ఆ రోజు నాకు కాళరాత్రి.. ప్రముఖ దర్శకుడిపై లైంగిక ఆరోపణలు

  |

  ప్రముఖ నటుడు నానాపాటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన లైంగిక ఆరోపణల తర్వాత బాలీవుడ్ చిత్ర పరిశ్రమ భారీ సంక్షోభంలో పడబోతున్నట్టు కనిపించబోతున్నది. వికాస్ బెహల్, అలోక్ నాథ్, రజత్ కపూర్, కైలాష్ ఖేర్ లాంటి పలువురు సినీ ప్రముఖులపై లైంగిక ఆరోపణలు బయటకు వస్తుండటం సినీలోకాన్ని షాక్ గురిచేస్తున్నది. వీరి తర్వాత ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై ఏకంగా లైంగిక ఆరోపణలు రావడం సినీ పరిశ్రమను కుదిపేసింది. పేరు చెప్పడానికి నిరాకరించిన ఓ మహిళ తన స్నేహితురాలు మహిమా ఖుర్కేజాకు చెప్పినదేమిటంటే..

  ఆ రోజు నాకు కాళరాత్రి

  ఆ రోజు నాకు కాళరాత్రి

  దర్శకుడు సుభాష్ ఘాయ్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. నరకం, కాళరాత్రి లాంటి అనుభవాన్ని చెప్పుకొంటూ ఆవేదనకు గురైంది. ఎన్నో ఏళ్లుగా సుభాష్ ఘాయ్‌తో కలిసి పనిచేశాను. అలాంటి నాకు డ్రగ్స్ ఇచ్చి దారుణంగా రేప్ చేశాడు అని సదరు మహిళ మొరపెట్టుకొన్నది. ఇలా సుభాష్ ఘాయ్‌పై ఆరోపణలు రావడంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది.

  దారుణంగా బిహేవ్ చేసేవాడు

  దారుణంగా బిహేవ్ చేసేవాడు

  సుభాష్ ఘాయ్‌తో పనిచేసే ఆరంభ దినాల్లో నన్ను మ్యూజిక్ రికార్డింగ్స్‌కు తీసుకెళ్లేవాడు. ఆయనతో మరికొంత మంది పురుషులతో అర్ధరాత్రి వరకు ఉండాల్సి వచ్చేది. రికార్డింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి నేను ఆటోలో వెళ్లేదానిని లేదా అతను కారులో డ్రాప్ చేసేవాడు. ఆ సమయంలో నాతో దారుణంగా బిహేవ్ చేసేవాడు అని సదరు నటి పేర్కొన్నది.

  తొడలపై చేతులు వేసి

  తొడలపై చేతులు వేసి

  కారులో సమయంలో నా తొడలపై చేతులు వేసేవాడు. నన్ను గట్టిగా కౌగిలిలో బంధించేవాడు. రకరకాల అకృత్యాలు చేసేవాడు. ఓ స్క్రిప్టు డిస్కషన్ కోసం ఓ రోజు లోఖండ్‌వాలాలోని అపార్ట్‌మెంట్‌కు పిలిచాడు. ఆ సందర్భంగా పరిశ్రమలో తనను ఎలా తప్పుగా అర్ధం చేసుకొంటారో అని చెప్పి భోరుమన్నాడు. నా ఒడిలో తలపెట్టుకొని ఎక్కి ఎక్కి ఏడ్చాడు. అలా చేస్తూనే లేచి నన్ను గట్టిగా ముద్దు పెట్టుకొన్నాడు. దాంతో నేను షాక్ తిని అక్కడి నుంచి వెళ్లిపోయాను.

  మాటలతో వేధించే వాడు

  మాటలతో వేధించే వాడు

  మరుసటి రోజు ఆఫీస్‌కు వెళ్లగానే లవర్స్ మధ్య ఇలాంటి ఉంటాయి అని చెప్పి సుభాష్ ఘాయ్ మాటలతో వేధించాడు. ఆ సమయంలో ఉద్యోగం మానేద్దామని అనుకొన్నాను. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను ఉద్యోగాన్ని వదులుకోలేకపోయాను. అయితే ఇలాంటి వేధింపులు రెగ్యులర్‌గా సాగుతుండేవి అని మహిళ పేర్కొన్నారు.

  డ్రింక్ ఇచ్చి నాపై బలత్కారం

  డ్రింక్ ఇచ్చి నాపై బలత్కారం

  ఇలాంటి వేధింపుల మధ్య ఒకరోజు మ్యూజిక్ సిట్టింగ్‌కు హాజరయ్యాను. అప్పుడు జరిగిన పార్టీలో డ్రింక్ ఆఫర్ చేశాడు. అది తాగిన తర్వాత నేను మత్తులోకి జారుకొన్నాను. నన్ను కారులోకి ఎక్కించినట్టు అర్ధమైంది. నన్ను ఇంటికి తీసుకెళ్తున్నాడని అనుకొన్నాను. కానీ ఆయన ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. నాపై బలత్కారం చేయడానికి ప్రయత్నించగా అడ్డుకొన్నాను.

  Kangana Ranaut Talks About #Metoo

  కేకలు వస్తే నా నోట్లో..

  గదిలో నా జీన్స్, బట్టలు విప్పేసి నాపై పడిపోయాడు. ఆ సమయంలో నేను గట్టిగా అరిచాను. దాంతో నా నోరును గట్టిగా చేతితో అదిమిపట్టాడు. ఆ విధంగా నాపై దారుణానికి ఒడిగట్టాడు. మరుసటి రోజు ఇంట్లో దించేసి వెళ్లిపోయాడు. చాలా రోజులు ఆఫీస్‌కు వెళ్లలేదు. సెలవుల్లో ఉన్న రోజుల్లో జీతం కూడా ఇవ్వలేదని మహిళ చెప్పిందని మహిమా ఖుర్కేజా ట్విట్టర్‌లో వెల్లడించింది.

   ఆరోపణల్లో వాస్తవం లేదని సుభాష్ ఘాయ్

  ఆరోపణల్లో వాస్తవం లేదని సుభాష్ ఘాయ్

  తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై సుభాష్ ఘాయ్ స్పందించాడు. మహిళ చేసిన ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. వాటిలో వాస్తవం లేదు. గతంలో నాకు ఇలా జరిగిందంటూ ప్రముఖులపై ఆరోపణలు చేయడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి కట్టుకథలను నమ్మవద్దు అని సుభాష్ ఘాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే కేసు నమోదు చేసి కోర్టుకు లాగుతాను. పరువు నష్టం దావా వేయడానికి కూడా వెనుకాడను అని ఆయన హెచ్చరించాడు.

  English summary
  An anonymous woman shared her nightmarish experience with Subhash Ghai. She says that while working with the director on a film many years ago, he drugged and raped her. She wrote, "In the beginning, he would take me to music recordings and I would have to sit there till very late at night with other male members. When recordings finished, I took an auto home or he would drop me. He slowly started putting his hand on my thigh, giving me a big hug saying that I did good that day."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more