twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ లో మొదలైన హడావిడి... మొదలుపెట్టేసిన లవ్ బర్డ్స్

    |

    లాక్ డౌన్ వల్ల చితికిల పడ్డ సినిమా ఇండస్ట్రీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. షూటింగ్ లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటెకెక్కిన సినిమాలను దుమ్ముదులిపి పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ షూటింగ్ లు మొదలుపెట్టేయగా ఇప్పుడ యంగ్ స్టర్స్ కూడా రెడీ అయిపోతున్నారు.

    లాక్ డౌన్ కు ముందు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మొదలైన బ్రహ్మాస్త్ర సినిమా తాజాగా ఫైనల్ షెడ్యూల్ పూర్తిచేసుకునేందుకు సిద్ధమైంది. సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న రణ్ బీర్, ఆలియా ఈరోజు నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడం మొదలుపెట్టారు. అయాన్ ముఖర్జీ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా మరో రెండు రోజుల్లో ఈ షూటింగ్ లో పాలుపంచుకోనున్నారని తెలుస్తోంది.

    Bollywood on Shooting Mode.. Brahmastra shoot resumed

    ప్రస్తుతం రణ్ బీర్, ఆలియా బాంద్రాలోని డబ్బింగ్ స్టూడియోలో సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ పాలుపంచుకుంటున్నారని తెలుస్తోంది. మరోవైపు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఎడిటింగ్ ను సైతం దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు. ఇక డబ్బింగ్, ఎడిటింగ్ కాకుండా, సినిమా విడుదలకు ముందు ప్రచారం నిమిత్తం స్పెషల్ వీడియోల చిత్రీకరణ కూడా మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

    మరోవైపు సినిమాకు సంబంధించి మరో 10 రోజల షూటింగ్ పెండింగ్ ఉండటంతో త్వరితగతిన అది కూడా పూర్తి చేయనున్నారు. ఈ ఇండోర్ షూటింగ్ లో రణ్ బీర్ తో కలసి అమితాబ్ బచ్చన్ కూడా పాలుపంచుకోబోతున్నారు. మరి, అంగరంగవైభవంగా ముస్తాబవుతున్న బ్రహ్మాస్త్ర ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి.

    English summary
    Bollywood on shoot mode as Ranbir and Alia start shooting for Brahmastra and Amitabh bacchan to join them soon. Salman khan to shoot for Radhe.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X