‘ హీరో, అతని భార్య కోట్లలో ముంచారు.. నా ఉసురు తగిలి, కెరీర్ క్లోజ్ ’

నిర్మాత అనే వాడు సినీ పరిశ్రమకు వెన్నెముక లాంటివాడు. ఆయన బాగుంటేనే చిత్ర పరిశ్రమ బాగుంటుందని అంటూ ఉంటారు. పాత కాలంలో నిర్మాతలకు ప్రతి ఒక్కరూ విలువనిచ్చేవారు. ఇదే విషయాన్ని అప్పటి నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్ చెప్పేవారు. కానీ కాలం మారింది .. నిర్మాత అనే వాడికి విలువ తగ్గింది. ఎవరో ఒకరు తప్పించి అందరు నిర్మాతలకు తగిన గౌరవం దక్కడం లేదని కాదనలేని వాస్తవం. టాలీవుడ్ టూ బాలీవుడ్ ప్రతి చోటా ఇదే పరిస్థితి.

సినిమాలపై ఆసక్తితోనే చిత్రాలు నిర్మించాలని కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వారెందరో. ఒకరో ఇద్దరో తప్పించి .. ఒకటి రెండు సినిమాలు తీసి తర్వాత కనిపించకుండా పోయేవారే ఎక్కువ. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చేవారే కాదు.. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉండి నిర్మాత కావాలని అనుకుని చేతులు కాల్చుకున్న వారు కూడా ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు బాలీవుడ్ నేపథ్య గాయకుడు, నటుడు మికా సింగ్. పశ్చిమ బెంగాల్‌లో పుట్టి పెరిగిన ఇతరు చిన్న వయసులోనే పాట్నా గురుద్వారాలో కీర్తనలు పాడేవాడు.

Bollywood producer mika singh made sensational comments on this star couple

బాలీవుడ్‌లో ఎన్నో హిట్ చిత్రాల్లో పాటలు పాడిన మికా సింగ్ తెలుగులో ఎన్టీఆర్ నటించిన అదుర్స్, రవితేజ బలుపు, ప్రభాస్ మిర్చి చిత్రాల్లోనూ పాటలు పాడి అలరించారు. గాయకుడిగానే కాకుండా పంజాబీ, హిందీ చిత్రాల్లో నటుడిగానూ ఆకట్టుకున్నారు. టెలివిజన్ షోలకు గెస్ట్‌గా, జడ్జిగా పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన సినిమాలు, పాటలు, కచేరీలతో పాటు కాంట్రవర్సీలకు కూడా మికా సింగ్ కేరాఫ్‌గా నిలిచారు. తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడంటూ బాలీవుడ్ హాట్ బాంబ్ రాఖీ సావంత్ ఈయనపై కేసు పెట్టింది. అలాగే ఓ హిట్ అండ్ రన్ కేసు కూడా ఆయనపై నమోదైంది.

ఇక మ్యూజిక్ వరల్డ్‌లో ఎంతో పేరు తెచ్చుకున్న మికా సింగ్ నిర్మాణ రంగం వైపు అడుగులు వేశారు. దీనిలో భాగంగా బాలీవుడ్ స్టార్ కపుల్ బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్‌లతో డేంజరస్ అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. 2020 ఆగస్ట్ 14న ఎంఎక్స్ ప్లేయర్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ..సినిమాకు భారీ ఖర్చు కావడంతో మికా సింగ్‌కు ఆర్ధిక సమస్యలు వచ్చాయట. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు ప్రస్తావించడంతో పాటు బిపాసా, కరణ్‌లపై విమర్శలు గుప్పించారు .

Bollywood producer mika singh made sensational comments on this star couple

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిపాసా దంపతులను టార్గెట్ చేశారు మికా సింగ్. తాను డేంజరస్ వెబ్‌సిరీస్‌ను రూ.4 కోట్లలో పూర్తి చేయాలని అనుకున్నానని.. కానీ బిపాసా, కరణ్‌ల కారణంగా అది రూ.14 కోట్లు దాటి పోయిందని తెలిపారు. లండన్‌లో జరిగిన షూటింగ్ సమయంలో వీరిద్దరూ నాటకాలు ఆడారని కుంటి సాకులతో చిత్రీకరణ ఆలస్యమయ్యేలా చేశారని మండిపడ్డారు. అంతేకాదు.. లిప్ లాక్ సీన్లలో నటించనని బిపాసా కండీషన్లు పెట్టేదని మికా సింగ్ అన్నారు.

పరిశ్రమలో పలువురు నటీనటులు నిర్మాతలను ఇలాగే ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడు మనం చేసే ప్రతి పనిని చూస్తూనే ఉన్నాడని అందుకే నాకు నష్టం చేసినందుకు గాను నేడు బిపాసా, కరణ్‌లు ఇంటికే పరిమితమయ్యారని మికా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: mika singh bipasha basu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X