Marriage: 47 ఏళ్ల వయసులో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో... ఆ ప్రముఖ మోడల్‌తో త్వరలోనే..!
ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుందనే చెప్పాలి. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మరోవైపు వెంకటేష్ కూతురి నిశ్చితార్థం కూడా జరిగింది. ఇక త్వరలో కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి అని కూడా అంటున్నారు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ లోనూ పెళ్లి బాజాలు మొదలు అయ్యాయని తెలుస్తోంది. అమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి త్వరలోనే జరగనుంది. ఇప్పుడు మరో హీరో కూడా పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి పండుగ మొదలైంది. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి సందడి ముగిసింది. ఇక బాలీవుడ్ లో జంటలు కూడా పెళ్లికి సిద్ధం అయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆయన ఎవరో కాదు... రణ్‌దీప్ హుడా. రణ్ దీప్ తన ప్రియురాలు నటి లిన్ లైస్రామ్ తో ఏడు అడుగులు వేయబోతున్నారు. ఇక నవంబర్ నెలలోనే వీరి పెళ్లి జరగనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

రణ్ దీప్ హూడా, లిన్ పెళ్లికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే వస్తారట. వీరి వివాహం ముంబైలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాతే ఈ జంట వారి బంధాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అప్పటివరకు వీరిద్దరు తమ రిలేషన్‌ను రహాస్యంగా ఉంచనున్నారని టాక్. మొత్తానికి రణ్ దీప్ ఓ ఇంటి వాడు అవుతున్నారని ఆయన ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.

ఇక రణ్ దీప్ హూడా ప్రేమించిన లిన్ విషయానికి వస్తే.. ఆమె మణిపూర్ కు చెందిన మోడల్. ఇక గతేడాది జరిగిన దీపావళి వేడుకల సందర్బంగా తమ రిలేషన్ గురించి బయటపెట్టింది. ఇక రణ్ దీప్ హూడా విషయానికి వస్తే.. ఆయన గతంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ ను ప్రేమించాడు. ఆమెతో రిలేషన్ లో కూడా ఉన్నాడు. 2004లో సుస్మితాసేన్ రణ్‌దీప్ డేటింగ్ చేసి... 2006లో విడిపోయారు.
ప్రస్తుతం రణ్ దీప్ కు 47 ఏళ్లు కాగా.. లిన్ 37 ఏళ్లు. వీరి మధ్య పదేళ్ల వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రణ్దీప్ హుడా అన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో ఇలియానాతో కలిసి నటిస్తున్నారు. వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తోన్న స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో నటించగా.. ఈ మూవీకి ఆయనే దర్శకుడు. మరోవైపు.. లిన్ చివరిసారిగా కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ నటించిన జానే జాన్‌లో నటించింది.


Click it and Unblock the Notifications











