For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ నుంచి తప్పుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిర్ణయం!

  |

  తెలుగులో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మలయాళంలో తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ మూవీని రీమేక్ చేయాలని ఇతర భాషల్లో కూడా చాలామంది చర్చలు జరుపుతున్నారు.

  ఇక తెలుగులో రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ తో పాటు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రల్లో నటిస్తుండడం సినిమాపై అంచనాల డోస్ అమాంతంగా అకాశాన్ని దాటేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా ని హిందీలో కూడా రిమేక్ చేయడానికి సిద్దమయిన విషయం తెలిసిందే. కానీ అనుకోకుండా ఒక హీరో తప్పుకున్నట్లు తెలుస్తోంది.

  హిందీలో కూడా భారీ స్థాయిలో

  హిందీలో కూడా భారీ స్థాయిలో

  జగన్ శక్తి హిందీలో ఈ మూవీకి దర్శకత్వం వహించనుండగా జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ ఇందులో ముఖ్య పాత్రలు చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ఎనౌన్స్ చేశారు. ఇటీవల ఈ ఇద్దరు స్టార్ హీరోలతో చర్చలు జరిపిన అనంతరమే స్క్రిప్ట్ ని బాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చే విధంగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసి సిద్ధం చేశారు. నవంబర్ లో దీనిని పట్టాలెక్కించేలా ప్లాన్ చేశారట.

  అభిషేక్ ఎందుకు తప్పుకున్నాడు?

  అభిషేక్ ఎందుకు తప్పుకున్నాడు?

  అయితే ఏమయ్యిందో ఏమో గాని హఠాత్తుగా ఈ సినిమా చేయడం లేదంటూ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ కి షాకింగ్ న్యూస్ వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా ఈ న్యూస్ పై అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఏది ఎంతవరకు నిజం అనే విషయంలో క్లారిటీ రాకముందే హీరోకు దర్శకుడికి క్లాష్ అవ్వడం వల్లే అలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రూమర్స్ వచ్చాయి.

  అసలు నిజం ఇదే..

  అసలు నిజం ఇదే..

  అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. బి టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అభిషేక్ ఇప్పటికే పార్థిపన్ దర్శకత్వంలో ఒత్త సెరుప్పు సైజు 7 మూవీ అనే హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే మరోవైపు బాబ్ విశ్వాస్, దస్వి సినిమాలు కూడా చేస్తున్నారు అభిషేక్. కాగా ప్రస్తుతం ఒత్త సెరుప్పు మూవీ షూటింగ్ చెన్నైలో జరుగుతుండగా మూడు రోజుల క్రితం అభిషేక్ చేతికి గాయం అయింది.

  ఆ కమిట్మెంట్స్ పూర్తి చేయాలని

  ఆ కమిట్మెంట్స్ పూర్తి చేయాలని

  ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న అభిషేక్, ముందుగా ప్రస్తుత తన కమిట్మెంట్స్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ పరిస్థితుల్లో అయ్యపనుం కోషియమ్ మూవీ రీమేక్ చేసే అవకాశం లేదని, అందుకే మేకర్స్ కి తాను నటించలేను అని చెప్పినట్లు టాక్. అభిషేక్ సడన్ గా సినిమా నుండి తప్పుకోవడంతో కొంత ఆలోచనలో పడ్డ యూనిట్, ప్రస్తుతం ఆయన స్థానంలో నటించే మరొక నటుడు కోసం వేట ప్రారంభించారట.

  Recommended Video

  Prabhas పై పెరుగుతున్న అక్కసు.. అప్పుడు రజినీ ఇప్పుడు డార్లింగ్ | Pan India || Filmibeat Telugu
  అతని స్థానంలో మరొక హీరో

  అతని స్థానంలో మరొక హీరో

  ఇక తెలుగులో భీమ్లా నాయక్ రిలీజ్ తరువాత ఇక్కడి ఆడియన్స్ నుండి వచ్చే స్పందిని బట్టి హిందీ వర్షన్ లో మరింతగా మార్పులు చేయాలా లేదా అనే ఆలోచనలో కూడా ఉన్నారట. ఇక ప్రస్తుతం వరుసగా విభిన్న తరహా సినిమాలు చేస్తూ ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కించుకుంటూ కొనసాగుతున్న అక్షయ్ కుమార్ ఈ సినిమా చేసే ఛాన్స్ ఉందని, త్వరలో ఆయనని కలిసి ఈ స్టోరీని వినిపించనున్నారని సమాచారం. మరి మలయాళం లో సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా తమిళ్, హిందీలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

  English summary
  Bollywood Remake Of Ayyappanum Koshiyum; Abhishek Walks Out
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X