twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అర్నబ్ గోస్వామి, టైమ్స్ నౌ టీవీ ఛానెల్స్‌పై బాలీవుడ్ కేసు.. 38 సంస్థలు మూకుమ్మడిగా ఫిర్యాదు

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై, సంస్థలు, ప్రొడక్షన్ హౌస్‌లపై వరుస కథనాలను ప్రచురించడం, ప్రసారం చేసిన రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ టెలివిజన్ ఛానెల్స్‌పై బాలీవుడ్ వర్గాలు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. తమ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రెండు సంస్థలు నిరాధారమైన వార్తలు ప్రసారం చేశాయంటూ ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్‌కు చెందిన 38 సంస్థలు పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

    బాలీవుడ్ ప్రతిష్టను దిగజార్చే విధంగా

    బాలీవుడ్ ప్రతిష్టను దిగజార్చే విధంగా

    బాలీవుడ్ ప్రతిష్ట మసకబారే విధంగా రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ ఛానెల్స్ తమ కథనాలను ప్రసారం చేశాయి. తమకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం, అవాస్తవాలను తమ కథనాల్లో వెల్లడించారు. కాబట్టి రిపబ్లిక్ టీవీకి చెందిన అర్నాబ్ గోస్వామి, ప్రదీప్ భండారీ, అలాగే టైమ్స్ నౌకు చెందిన రాహుల్ శివశంకర్, నవికా కుమార్‌కు సమన్లు జారీ చేయాలని తమ ఫిర్యాదులో సూచించారు.

    బాలీవుడ్ తారలు డ్రగ్స్ వ్యసనపరులు

    బాలీవుడ్ తారలు డ్రగ్స్ వ్యసనపరులు

    బాలీవుడ్‌ పరిశ్రమను డర్టీ అని, సినీతారలు చెత్త, డ్రగ్స్ వ్యసనపరులు అంటూ అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించారు. బాలీవుడ్‌లో పేరుకుపోయిన చెత్తను క్లీన్ చేయాలి, కొకైన్, ఎల్‌ఎస్‌డీ వ్యసనానికి బానిసైన బాలీవుడ్ అంటూ కథనాలను ప్రసారం చేశాయి. వారి కథనాలు అనుచితం, అభ్యంతరకరం అంటూ తమ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత

    సుశాంత్ సింగ్ మరణం తర్వాత


    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు లేదా డ్రగ్స్ కేసులో ఎన్సీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లపై మీడియా ఇన్వెస్టిగేషన్స్ తప్పుబడుతూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా ప్రసారం చేసిన కథనాలు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) యాక్ట్ 1995, సెక్షన్ 5కు వ్యతిరేకంగా ఉన్నాయి. అందువల్ల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని ఫిర్యాదు దారులు డిమాండ్ చేశారు. బాలీవుడ్ వర్గాల తరఫున డీఎస్‌కే లీగల్ సంస్థ పిటిషన్‌ను దాఖలు చేసింది.

    ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 37 సంస్థల పేర్లు

    ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 37 సంస్థల పేర్లు


    ప్రముఖ ఛానెల్స్‌ రిపబ్లిక్, టైమ్స్ నౌ‌ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేసిన సంస్థల్లో 38 ఉన్నాయి.
    ది ప్రొడ్యూసర్స్ గిల్డ్స్ ఆఫ్ ఇండియా
    ది సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
    ది ఫిల్మ్ అండ్ టీవీ ప్రొడ్యూసర్ కౌన్సిల్
    స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్
    అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్
    యాడ్ లాబ్స్ ఫిల్మ్స్
    అజయ్ దేవగన్ ఫిల్మ్స్
    ఆందోళన ఫిల్మ్స్
    అనిల్ కపూర్ ఫిల్మ్ అండ్ కమ్యునికేషన్ నెట్ వర్క్
    అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్
    అశుతోష్ గోవరికర్ ప్రొడక్షన్స్
    బీఎస్కే నెట్ వర్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
    కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స
    క్లీన్ స్టేట్ ఫిల్మ్స్
    ధర్మ ప్రొడక్షన్స్
    ఎమ్మాయ్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మోషన్ పిక్చర్స్
    ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్
    ఫిల్మ్ కార్ట్ ప్రొడక్షన్స్
    హోప్ ప్రొడక్షన్
    కబీర్ ఖాన్ ఫిల్మ్స్
    లవ్ ఫిల్మ్స్
    నాడియావాలా గ్రాండ్సన్ ఎంటర్‌టైన్‌మెంట్
    వన్ఇండియా స్టోరీస్
    రాకేష్ ఓంప్రకాశ్ మెహ్రా పిక్చర్స్
    రెడ్ చిల్లీస్ బిగ్‌ఎంటర్‌టైన్‌మెంట్
    రీల్ లైఫ్ ప్రొడక్షన్స్
    రాయ్ కపూర్ ప్రొడక్షన్స్
    సల్మాన్ ఖాన్ వెంచర్స్
    సోహైల్ ఖాన్ ప్రొడక్షన్స్
    వినోద్ చోప్రా ఫిల్మ్స్
    విశాల్ భరద్వాజ్ ఫిల్మ్స్
    యష్ రాజ్ ఫిల్మ్స్

    Recommended Video

    Birthday Wishes For The Bollywood Legend From Tollywood Stars
    బాలీవుడ్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు ఆగ్రహం

    బాలీవుడ్‌కు వ్యతిరేకంగా నెటిజన్లు ఆగ్రహం

    ప్రముఖ టెలివిజన్ చానెల్స్‌పై, అర్నబ్ గోస్వామి, నవికా కుమార్‌పై బాలీవుడ్ వర్గాలు ఢిల్లీ కోర్టులో కేసు నమోదు చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #BollywoodDirt #karanjohar హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. బాలీవుడ్‌ను బాయ్‌కాట్ చేయాలనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

    English summary
    Bollywood top production houses filed cases on Republic TV, Arnab Goswami and Navika Kumar and Times now. Bollywood big wigs filed over highly derogatory words and expressions for Bollywood such as dirt, filth, scum, druggies.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X