విద్యాబాలన్‌కు విషాదం.. బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనుమానాస్పద మృతి
బాలీవుడ్‌లో ప్రముఖ తారలకు ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యవహరించిన షర్బారీ దత్తా ఇక లేరు. కోల్‌కతాలోని కరయాలో ఉన్న తన నివాసంలో ఆమె అనుమానాస్పద పరిస్థితుల్లో బాత్రూంలో విగతజీవిగా కనిపించారు. దీంతో ఆమె మరణాన్ని అనుమానాస్పదంగా భావించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షర్బారీ దత్తా మరణ వార్తతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాతికి లోనయ్యారు. ఆమె మరణంపై సోషల్ మీడియాలో సంతాపం ప్రకటిస్తున్నారు. షర్బారీ దత్తా మరణానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...
షర్బారీ దత్తా వయసు 63 సంవత్సరాలు. ఆమె ప్రముఖ బెంగాళీ కవి అజిత్ దత్తా కూతురు. షర్బారీ దత్తా ప్రసిడెన్సీ కాలేజీలో డిగ్రీ పట్టా, కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఫిలాసపలో మాస్టర్ డిగ్రీని సాధించారు. ఆమెకు అమిలిన్ దత్తా అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

బాలీవుడ్‌లో విద్యాబాలన్, రచన బెనర్జీ లాంటి తదితర ప్రముఖులకు ఫ్యాషన్ డిజైనర్‌గా షర్బారీ దత్తా వ్యవహరించారు. మీరు మరణించారంటే నేను నమ్మలేకపోతున్నాను అని రచన బెనర్జీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
షర్బారీ దత్తా మరణ వార్త వినగానే బెంగాళీ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. గాయకులు పరమా బెనర్జీ, ఉజ్జయిని ముఖర్జీ, రుక్మిణి మొయిత్రా, దేబేష్ చటర్జీ లాంటి ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


Click it and Unblock the Notifications











