Govinda: తుపాకీ కాల్పుల్లో గాయపడ్డ గోవింద.. ఐసీయూలో బాలీవుడ్ హీరో పరిస్థితి ఆందోళనగా!

బాలీవుడ్ సీనియర్ నటుడు , రాజకీయ నాయకుడు గోవింద బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. మంగళవారం తెల్లవారుజామున తన రివాల్వర్‌ను క్లీన్ చేస్తుండగా , ప్రపమాదవశాత్తూ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో గోవింద తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవిందాకి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తలను బట్టి మంగళవారం ఉదయం గోవింద ముంబైలోని తన ఇంటి నుంచి కోల్‌కతాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ను తీసుకెళ్తుండగా అది చేతిలో నుంచి జారి కిందపడింది. ఆ వెంటనే తుపాకీ పేలి కాలిలోకి దూసుకెళ్లింది. కాల్పుల శబ్ధం విన్న కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది గోవిందను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అనంతరం వైద్యులు చికిత్స అందించి బుల్లెట్‌ను తొలగించారు.

Bollywood Senior actor govinda was shot by his own gun

అయితే అప్పటికే గోవిందాకు భారీ రక్తస్రావం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. చికిత్స నేపథ్యంలో ఆయన కొద్దిరోజులు ఆసుపత్రిలోనే ఉంటారని గోవింద టీమ్ చెప్పినట్లుగా బాలీవుడ్ మీడియా అంటోంది. ప్రస్తుతం గోవింద ముంబైలోని క్రిటిక్ కేర్ ఆసుపత్రిలో ఉన్నారని, ఘటన తర్వాత పోలీసులు కాల్పులకు కారణమైన తుపాకీని సీజ్ చేసినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అసలు గోవింద ఆ తుపాకీని ఎందుకు బయటకు తీశారు?, తనతో పాటు ఎందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు? అనే దానిపై విచారణ చేస్తున్నారు.

1963 డిసెంబర్ 21న ముంబైలో జన్మించిన గోవిందా అసలు పేరు.. గోవింద్ అరుణ్ అహుజా. సినిమాల్లోకి వచ్చాక తన స్టేజ్ నేమ్‌ను గోవిందగా మార్చుకున్నారు. 1986లో లవ్ 86 మూవీ ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ అద్భుతం. 90లలో షోలా ఔర్ షబ్నమ్, ఆంకెన్, రాజా బాబు, కూలీ నెంబర్ 1. హీరో నెంబర్ 1, దీవానా మస్తానా, దుల్హే రాజా, బడే మియా చోటా మియా, అనారి నెంబర్ 1, జోడీ నెంబర్ 1 వంటి చిత్రాలతో బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్, అమీర్, సల్మాన్ , అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ వంటి వారికి గట్టి పోటీనిచ్చారు.

2000 ప్రారంభం నుంచి గోవింద జోరు తగ్గింది. అయినప్పటికీ ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తూ అభిమానులను అలరించారు. 2015లో జీ హిందీలో వచ్చిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్ సీజన్ 2కి జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రాజకీయాల్లో చురుగ్గా ఉండే గోవింద.. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా నగరంలోని కొన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేశారు గోవింద. అయితే 2008లో అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుని షాకిచ్చారు గోవింద. తిరిగి తన సినిమాల్లో బిజీ అయిన ఆయన 2024 ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనలో చేరారు.

More from Filmibeat

Read more about: bollywood govinda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X