49 ఏళ్ల వయసులో కాజోల్ ఖతర్నాక్ షో: కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా అందాల ఆరబోత
సాధారణంగా సినీ రంగంలో హీరోయిన్ల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది. దీంతో వయసు పెరిగే కొద్దీ ఫేడౌట్ అవుతుంటారు. కానీ, ఇప్పుడు చాలా మంది భామలు ఏజ్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్నారు. అందులో బాలీవుడ్ బ్యూటీ కాజోల్ ఒకరు. సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో ప్రభావాన్ని చూపిస్తోన్న ఈ భామ.. ఇప్పటికి కూడా అదే రీతిలో అలరిస్తూ ముందుకు సాగుతోంది. కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఆఫర్లను పట్టేస్తుంది. ఇక, సోషల్ మీడియాలో కాజోల్ రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలు వదిలింది. అవి మీరే చూడండి!
టీనేజ్‌లోనే మొదలుపెట్టింది:సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన కాజోల్ టీనేజ్‌లోనే 'బెఖుడి' అనే సినిమాలో నటించింది. అయితే, ఇది మాత్రం హిట్ కాలేదు. ఆ తర్వాత 'బాజీగర్' మూవీలో నటించింది. ఇది మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఆమె పేరు బాలీవుడ్‌లో మారుమ్రోగింది. దీంతో కాజోల్ చదువును మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి ఎంటరైంది. తర్వాత వరుసగా మూవీలు చేసింది.

దేశంలోనే స్టార్ హీరోయిన్‌గా:అందం, అభినయంతో రాణించిన కాజోల్.. మధ్యలో డిజాస్టర్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుకుంది. తన కెరీర్‌లో 'కరణ్ అర్జున్ ', 'దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే', 'గుప్త్', 'ప్యార్ కియాతో డర్నా క్యా', 'ప్యార్ తో హోనా హై తా', 'కుచ్ కుచ్ హోతా హై' వంటి చిత్రాలతో నేషనల్ స్టార్‌గా మారింది.
హీరోను పెళ్లి చేసుకోవడంతో:స్టార్‌డమ్ అందుకుని కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే కాజోల్ 'గుండారాజ్' సినిమాను చేసింది. ఆ సమయంలోనే హీరో అజయ్ దేవగణ్‌తో లవ్‌లో పడిపోయింది. అలా ఇద్దరూ ఐదేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఈ జంటపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. దీంతో వీళ్లిద్దరి పెళ్లి దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారిపోయింది.

ఇప్పటికీ.. అలాంటి పాత్రల్లో:ప్రస్తుతం కాజోల్‌కు 49 సంవత్సరాలు. అయినా ఈ సీనియర్ బ్యూటీ కుర్ర హీరోయిన్లతో సమానంగా కెరీర్‌ను సాగిస్తోంది. ఈ మధ్య కాలంలో చాలా చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్‌తో పాటు 'సారాజమీన్' అనే సినిమాను చేసింది. వీటిలో కాస్త బోల్డుగా కనిపించింది. ఇక, 'The Good Wife' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్:చాలా కాలం పాటు వరుసగా సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాస్త స్లో అయినా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ మాత్రం సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. తద్వారా వాళ్లను ఖుషీ చేయడంతో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

ఈ ఏజ్‌లోనూ హాట్ ట్రీట్‌తో:చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న కాజోల్.. అప్పుడప్పుడూ తన అందాలను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని చాటి చెబుతోంది. అదే సమయంలో తన అందాలతో ఇప్పటికీ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.
కాజోల్ అందాల ఆరబోత:సీనియర్ హీరోయిన్ కాజోల్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ డిజైన్‌తో ఉన్న డ్రెస్ వేసుకుని విపరీతంగా హాట్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోన్నాయి. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా కాజోల్ పిక్స్ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











