అసలు టచ్ చేయడు .. నాకీ మొగుడొద్దు , టాప్ హీరో బండారం బయటపెట్టిన భార్య

నటీనటుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సెలబ్రెటీలు కాబట్టి వారు ఏం చేసినా? ఏం మాట్లాడినా? అది పెద్ద కాంట్రవర్సీ అవ్వడమో, ఇంట్రెస్టింగ్ టాపిక్ అవ్వడమో జరుగుతుంటుంది. అయితే మీడియా, సోషల్ మీడియాలో హద్దులు దాటి తారల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. అలాంటిది ఓ బాలీవుడ్ స్టార్ హీరో భార్య తన భర్త గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ జంట ఎవరో కాదు.. గోవింద- సునీత అహుజా.

కపూర్‌లు, ఖాన్‌లు బాలీవుడ్‌ను ఏలేస్తున్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నారు గోవింద. యాక్షన్ సినిమాల వైపు కాకుండా కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించారు. ముఖంపై చెరగని చిరునవ్వు, కామెడీ టైమింగ్, విచిత్రమైన హావభావాలు గోవిందకు మంచి పేరు తీసుకొచ్చింది.

Bollywood senior hero govinda wife Sunita Ahuja made sensational comments on her husband

1963 డిసెంబర్ 21న ముంబైలో జన్మించిన గోవిందా అసలు పేరు.. గోవింద్ అరుణ్ అహుజా. సినిమాల్లోకి వచ్చాక తన స్టేజ్ నేమ్‌ను గోవిందగా మార్చుకున్నారు. 1986లో లవ్ 86 మూవీ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన హీరోగా నిలదొక్కుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. అప్పటికే బాలీవుడ్‌ మొత్తం స్టార్ హీరోలతో నిండిపోగా ఆయన వినూత్నమైన కథలతో ముందుకొచ్చారు. 90లలో షోలా ఔర్ షబ్నమ్, ఆంకెన్, రాజా బాబు, కూలీ నెంబర్ 1. హీరో నెంబర్ 1, దీవానా మస్తానా, దుల్హే రాజా, బడే మియా చోటా మియా, అనారి నెంబర్ 1, జోడీ నెంబర్ 1 వంటి చిత్రాలతో అగ్రహీరోలకు గట్టి పోటీనిచ్చారు.

2000 ప్రారంభం నుంచి గోవింద జోరు తగ్గింది. అయినప్పటికీ ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తూ అభిమానులను అలరించారు. 2015లో జీ హిందీలో వచ్చిన డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ సూపర్ మామ్ సీజన్ 2కి జడ్జిగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల ప్రమాదవశాత్తూ మిస్ ఫైర్ కావడంతో గోవింద ఆసుపత్రి పాలై కోలుకున్నారు. ఈ నేపథ్యంలో గోవింద సతీమణి తన భర్త, వైవాహిక జీవితం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Bollywood senior hero govinda wife Sunita Ahuja made sensational comments on her husband

దాదాపు 40 ఏళ్లుగా ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. తన భర్తకు ఆడవాళ్లంటే భయమని వారికి దూరంగా పారిపోతారని.. కనీసం ముట్టుకోవాలన్నా కష్టమేనన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలాంటి భర్త మాత్రం వద్దని, ఎందుకంటే నన్ను ఆయన బయటికి తీసుకెళ్లడం చాలా తక్కువని సునీత సరదాగా వ్యాఖ్యానించారు. తన పనుల్లో బిజీగా ఉండటంతో ఇద్దరం వేర్వేరు ఇళ్లలో ఉండాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ఇంటర్వ్యూలో హీరోయిన్ రవీనా టాండన్ - గోవింద మధ్య వచ్చిన రూమర్స్‌పై సునీత స్పందించారు. తను రవీనా ఎప్పుడు కలిసినా.. నీకన్నా ముందు గోవిందాతో పరిచయం అయ్యుంటే ఆయన్ను పెళ్లి చేసుకునేదాన్నని ఆటపట్టిస్తుందని సునీత పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X