హీరో వల్ల ఇల్లు అమ్ముకుని.. రాత్రికి రాత్రే, నటుడి బాగోతం బయటపెట్టిన హీరోయిన్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇటీవల దుండగుడి దాడిలో గాయపడి చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు. ఇంట్లో దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తిని అడ్డుకునే క్రమంలో సైఫ్‌పై అగంతకుడు దాడి చేశాడు. కుటుంబ సభ్యులు , ముఖ్యంగా పెద్ద కొడుకు ఇబ్రహీం చాకచక్యంగా వ్యవహరించడం.. వెంటనే చికిత్స అందడంతో సైఫ్ అలీఖాన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయనపై జరిగిన దాడితో భారతీయ చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది.
పటౌడీ రాజవంశానికి వారసుడైన సైఫ్ అలీ ఖాన్.. అలనాటి క్రికెటర్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ- సినీనటి షర్మిలా ఠాగూర్ కుమారుడు . బేకౌడీతో (1992)లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. 1993లో పరంపరతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సైఫ్ అలీ ఖాన్ తనదైన నటనతో మూడు దశాబ్ధాలుగా అలరిస్తున్నారు. యాక్టింగ్, ఫిట్‌నెస్, వ్యక్తిగత జీవితం.. ఇలా సైఫ్‌కి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఉంటుంది.

స్టార్ హీరో, రాజవంశం అయినంత మాత్రాన ఆయనేమీ కష్టాలకు అతీతం కాదు. సగటు మనిషిగా వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 21 ఏళ్ల చిన్న వయసులోనే 1991లో బాలీవుడ్ నటి అమృతా సింగ్‌తో సైఫ్ అలీ ఖాన్ పెళ్లయ్యింది. ఈ దంపతులకు సోహా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ సంతానం. ఆ తర్వాత ఈ జంట విడిపోగా.. సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌ను ప్రేమించి పెళ్లాడారు . ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు సంతానం.
రాజ కుటుంబీకుడైనా, వేల కోట్లకు వారసుడైనా, తిరుగులేని స్టార్ డమ్ ఉన్నా .. సైఫ్ అలీఖాన్ చాలా సింపుల్‌గానే ఉంటారు. తన ఇంట్లో పనిచేసే వారిని కూడా బాగా చూసుకుంటారని ఆయనకు ఇండస్ట్రీలో పేరు. అలాంటి సైఫ్ అలీఖాన్ వల్ల ఓ హీరోయిన్ ఇల్లు అమ్ముకుని వెళ్లిపోయిందట. 90లలో దేశాన్ని ఒక ఊపు ఊపిన హీరోయిన్ షీబా ఆకాశ్‌దీప్ ఒకప్పుడు సైఫ్ ఆయన మొదటి భార్య అమృతా సింగ్‌కు స్నేహితులు. రెండు కుటుంబాలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవి. అయితే అనుకోకుండా ఓ రోజున షీబా కుక్కను.. సైఫ్ - అమృతల పెంపుడు కుక్క చంపేసింది.

పింక్‌విల్లాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో షీబా మాట్లాడుతూ.. ఈ సంఘటన తర్వాత మేం మాట్లాడుకోవడం మానేశామని చెప్పింది. సైఫ్ జరిగిన దానికి క్షమాపణలు చెప్పడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికీ తాను క్షమించలేకపోయానని షీబా తెలిపారు. నా భర్తతోనూ ఆమె ఎప్పటికీ నన్ను క్షమించదా అని అడిగాడని ఆమె వెల్లడించారు. అది నాకు ఇష్టమైన కుక్క కావడంతో ఈ ఘటన తర్వాత నా మనసు ముక్కలైందని.. ఇల్లు అమ్మేసి రాత్రికి రాత్రే వెళ్లిపోయానని షీబా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.


Click it and Unblock the Notifications











