కనికాకపూర్ పరిస్థితి దారుణం.. వరుసగా మూడోసారి.. ఏ క్షణంలోనైనా!

సింగర్ కనికాకపూర్ వ్యవహారాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కరోనావ్యాధితో బాధ్యతారాహిత్యంగా లక్నోలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్న విలాసవంతమైన విందుకు హాజరకావడం అత్యంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దాంతో నిర్లక్షపూరితంగా వ్యవహారించారనే ఆరోపణలపై లక్నో మెడికల్ కాలేజీ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డాక్టర్ ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు ఇంకా కరోనావైరస్ తీవ్రస్థాయిలోనే ఉందనే విషయం తాజాగా మరోసారి వెల్లడైంది.

 వరుసగా మూడోసారి

వరుసగా మూడోసారి

లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్‌ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత రోగ లక్షణాలు గుర్తించిన వైద్యులు ఆమెకు మార్చి 20న, మార్చి 23న నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ ఆమెకు తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయాన్ని వైద్యులు మరోసారి నిర్దారించారు.

ఇంకా గృహనిర్బంధంలోనే

ఇంకా గృహనిర్బంధంలోనే

బాలీవుడ్ సింగర్ కనికాకపూర్‌కు నిర్ధారించిన రోగ నిర్ధారణ పరీక్షల్లో వరుసగా మూడోసారి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం లక్నోలోని సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేషన్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే గృహ నిర్బంధంలో ఉన్నారు అని తెలిపారు.

నిర్లక్ష్యంగా వ్యవహరించారని

నిర్లక్ష్యంగా వ్యవహరించారని

ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కనికాకపూర్ బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలపై ఆమెపై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188, 269, 270 ప్రకారం లక్నో సరోజినినగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు ఊపందుకొన్నాయి.

Recommended Video

Celebs Response On Vakeel Saab First Look | Pawan Kalyan | PSPK 26
 ఏ క్షణంలోనైనా అరెస్ట్

ఏ క్షణంలోనైనా అరెస్ట్

అయితే కనికాకపూర్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగపడగానే ఆమెను అదుపులోకి తీసుకొంటారనే ఊహాగానాలు ఉత్తరప్రదేశ్‌లో మొదలయ్యాయి. కరోనావైరస్ పరీక్షల్లో నెగిటివ్ అని తేలగానే ఆమెను అరెస్ట్ చేసి విచారించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆమెకు మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X