twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూ ట్యూబ్ వ్యూవ్స్ కోసం బాలీవుడ్ సింగర్ భారీ స్కామ్.. ఇతర స్టార్స్ పై కూడా అనుమానాలు?

    |

    సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో సెలబ్రెటీస్ కి ఒక ప్రధాన ఆయుధంలా మారింది. వేగంగా క్రేజ్ ని పెంచుకోవాలని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ లో వివిధ రకాల ఫేక్ ఎకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు స్టార్స్ అత్యాశకు పోయి ఇందులో కూడా స్కామ్ లకు పాల్పడుతుండడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఒక బాలీవుడ్ ర్యాపర్ ఏకంగా 72లక్షల రూపాయలను ఖర్చు చేసి ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని అబుకున్నాడు.

    బాలీవుడ్ ర్యాపర్ స్కామ్

    బాలీవుడ్ ర్యాపర్ స్కామ్

    బాలీవుడ్ ర్యాపర్ సింగర్ బాద్ షా ఇటీవల తన పాగల్ హై సాంగ్ ను యూ ట్యూబ్ లో రిలీజ్ చేశాడు. అయితే మొదటి రోజే అతను రికార్డు స్టయిల్ వ్యూవ్స్ అందుకోవాలని ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు రాగా ముంబై పోలీసులు ఆరా తీశారు. అయితే అది నిజమేనని పోలీసులు కూడా చెబుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

    72 లక్షలతో ఒప్పందం

    72 లక్షలతో ఒప్పందం

    యూ ట్యూబ్ లో 24గంటల్లో అత్యదిక వ్యూవ్స్ వచ్చే విధంగా బాద్ షా ఒక ఫ్రాడ్ కంపెనీతో దాదాపు 72 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అనుకున్నట్లుగానే 75మిలియన్స్ వ్యూవ్స్ తో గత యూ ట్యూబ్ రికార్డులను ఈ సాంగ్ బ్రేక్ చేసింది. అయితే గూగుల్ ఈ వ్యూవ్స్ ని కొట్టిపారేసింది. అనంతరం పోలీసులు కూడా ఫేక్ ఫాలోవర్స్, ఫేక్ వ్యూవ్స్ పై ఆరా తీశారు.

     న్యాయం పోరాటం చేస్తా..

    న్యాయం పోరాటం చేస్తా..

    అదే విధంగా ర్యాపర్ ని ఇటీవల పోలీసులు గంటల తరబడి విచారించారు. అయితే ఫేక్ వ్యూవ్స్ అంటూ వస్తున్న ఆరోపణలను బాద్ షా కొట్టి పారేశారు. తనకు ఆ అవసరం లేదని అంటూ తనపై అనవసరంగా కొందరు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అదే విధంగా ఈ విషయాన్ని తాను అంత తేలిగ్గా తీలుకొనని చట్టపరమైన విధానాలతో న్యాయం పోరాటం చేస్తానని బాద్ షా వివరణ ఇచ్చారు.

    ఒక్కసారి ఆ అకౌంట్స్ పై లుక్కేస్తే..

    ఒక్కసారి ఆ అకౌంట్స్ పై లుక్కేస్తే..

    ఇక బాద్ షాతో పాటు చాలా మంది సినీ సెలబ్రెటీస్ ఇదే దారిలో నడుస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఫేక్ సోషల్ మీడియా ఎకౌంట్స్ ని క్రియేట్ చేసి సెలబ్రెటీస్ తమ ఫాలోవర్స్ సంఖ్యను కావాలనే పెంచుకుంటున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక్కసారి ఎకౌంట్స్ పై సెర్చింగ్ కొనసాగితే ప్రస్తుతం స్టార్ సెలబ్రెటీస్ ఫాలోవర్స్ సంఖ్య సగానికి పైగా తగ్గే అవకాశం ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.

    English summary
    Social media has become a major weapon for celebrities these days. Various fake accounts are being opened on the social media platform to increase the craze fast. However, sometimes the stars go greedy and commit scams in this too, which shocks everyone. A Bollywood rapper has set a new record of Rs 72 lakh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X