Don't Miss!
- News
Budget 2023: తినబోతూ రుచులెందుకు..!!
- Finance
Jio laptop: మార్కెట్లోకి Jio ల్యాప్ ట్యాప్.. ఫీచర్లు, ధర చూస్తే వావ్ అనాల్సిందే !!
- Sports
INDvsNZ : మూడో టీ20లో ఈ రికార్డులు బద్దలవడం ఖాయం.. సూర్య సాధిస్తాడా?
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Aamir Khan: ఆ అమ్మాయితో ఫస్ట్ లవ్.. అప్పుడే హార్ట్ బ్రేక్ అయ్యింది..
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం అమీర్ ఖాన్ ఎక్కువగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. తన రెండవ భార్య కిరణ్ రావ్ కు కూడా విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా సినిమా ప్రమోషన్ లో ఆమీర్ ఖాన్ తన ఫస్ట్ లవ్ గురించి ఒక వివరణ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

నమ్మకమైన నటుడు
విభిన్నమైన సినిమాలతో నటుడిగా ఎంతగానో గుర్తింపును అందుకున్న ఆమీర్ ఖాన్ నుంచి ఏదైనా సినిమా థియేటర్ లోకి వస్తుంది అంటే తప్పకుండా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకుల్లో ఒక బలమైన నమ్మకం అయితే ఏర్పడింది. అందుకే ఆమీర్ ఖాన్ సినిమా విడుదల అవుతోంది అంటే మిగతా సినిమాలు కూడా చాలా వరకు వాయిదా పడుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం అందరికి ఫోకస్ 'లాల్ సింగ్ చద్దా' పైనే ఉంది.

గ్రాండ్ రిలీజ్
'ఫారెస్ట్ గంప్' సినిమా ఆధారంగా తెరకెక్కిన లాల్ సింగ్ చద్దా సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా పరిస్థితిలో కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధమయింది. మొత్తానికి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు కూడా మంచి స్పందన లభించింది. టాలీవుడ్ హీరో నాగచైతన్య ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ఆగస్టు 11వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

ఫస్ట్ లవ్
అయితే రీసెంట్ గా లాల్ సింగ్ చద్దా సినిమాకు సంబంధించిన ఒక మెలోడీ సాంగ్ విడుదల చేసిన ఆమీర్ ఖాన్ తన పర్సనల్ లైఫ్ లోనే మరొక ఆసక్తికరమైన విషయాన్ని గురించి కూడా తెలియజేశాడు. చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయితో ప్రేమలో పడినట్లుగా వివరణ ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయితో ఎప్పుడూ కూడా తాను మాట్లాడలేదని అన్నాడు.

ఆ అమ్మాయి కోసం
చిన్నప్పుడు నాకు టెన్నిస్ ప్లేయర్ అవ్వాలని ఉండేది. అయితే ప్రతీరోజు ప్రాక్టీస్ చేసేందుకు టెన్నిస్ క్లబ్ కు కూడా వెళ్ళేవాన్ని. ఇక అక్కడ ఒక అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ఫిదా అయిపోయాను. ఆ తర్వాత రోజు ఆమెను చూడడానికి మిస్ అవ్వకుండా వచ్చేవాడిని. కానీ ఎప్పుడూ కూడా ఆమెకు నా ప్రేమను వ్యక్తపరిచింది లేదు. కేవలం అలా దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని అని.. అమీర్ ఖాన్ తెలియజేశాడు.

అలా హార్ట్ బ్రేక్ అయ్యింది
అయితే ఒకరోజు మాత్రం నా గుండె ముక్కలైపోయింది. ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత రాకపోవడంతో షాకయ్యాను. విషయం ఏమిటంటే ఆమె తన తల్లిదండ్రులతో కలిసి విదేశాలకు వెళ్లిపోయినట్లుగా తెలిసింది. దీంతో ప్రేమను వ్యక్తపరచుకముందే ఫస్ట్ లవ్ అలా మిస్సయిపోయింది. అనంతరం నా గుండే ఒక్కసారిగా బ్రేక్ అయ్యింది.. అని అమీర్ ఖాన్ చాలా సరదాగా ఆ విషయాన్ని మీడియా మిత్రులతో పంచుకున్నాడు.