Ranveer Singh న్యూడ్ గా ఫొటో షూట్.. పేమెంట్ ఎంత తీసుకున్నాడో తెలుసా?
సినిమా ప్రపంచంలో కొన్నిసార్లు సెలబ్రిటీలు చేసే కామెంట్స్ అలాగే ఫోటోషూట్స్ హాట్ టాపిక్ గా మారిపోతుంటాయి. చాలావరకు ఫోటోషూట్స్ నిర్వహించడంలో మాత్రం ఏదో ఒక లాభాన్ని ఆశించే ముందడుగు వేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా రణ్‌వీర్ సింగ్ ఏ విధంగా ఆలోచించి అలాంటి ఫోటోషూట్స్ చేశాడు అనేది అందరిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలో రణ్‌వీర్ సింగ్ ఆ ఫోటోషూట్ చేయడానికి ఏ స్థాయిలో పేమెంట్ తీసుకున్నాడు అనేది కూడా వైరల్ గా మారుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నమ్మకమైన హీరో
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నా రణ్‌వీర్ యువతలో మంచి క్రేజ్ అందుకున్నాడు అనే చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతను అడుగుపెట్టిన మొదట్లోనే చాలా తొందరగా మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఎలాంటి సినిమా చేసిన కూడా మినిమం వసూళ్లను అందుకుంటూ నిర్మాతల్లో ఒక నమ్మకం కూడా ఏర్పరచుకున్నాడు.

పెళ్లి తరువాత
అయితే రణ్‌వీర్ సింగ్ అప్పుడప్పుడు నిర్వహించే ఫోటోషూట్స్ మాత్రం ఊహించని విధంగా ఉంటాయి. అతను కనిపించే విధానం కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విభిన్నంగా డ్రెస్సింగ్ స్టైల్ తో కూడా ఆకట్టుకుంటు ఉంటాడు. ఇక ఇంటర్వ్యూలలో కూడా కొన్ని బోల్డ్ కామెంట్ చేస్తూ ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. ఇక దీపిక పదుకొనేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అతను ఎప్పటి లానే లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పాలి.

న్యూడ్ ఫొటో షూట్
ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం రణ్‌వీర్ సింగ్ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ సెలబ్రెటీలు సైతం ఇది పిచ్చి అంటూ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఒకే ఒక్క ఫోటోషూట్ తో అతను సౌత్ ఇండస్ట్రీలో కూడా హైలెట్ గా నిలిచాడు. ఒంటి మీద నూలుపోగు లేకుండా నగ్నంగా ఫోటోషూట్ నిర్వహించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

గతంలో ఎప్పుడు లేని విధంగా..
రణ్‌వీర్ సింగ్ ఎన్నోసార్లు ఫోటోషూట్స్ చేసినప్పటికీ ఈ రేంజ్ లో నగ్నంగా మాత్రం ఎన్నడూ ఫొటోలకు పోజు ఇచ్చింది లేదు. ఇక అతను ఎందుకు ఈ తరహా నగ్నమైన ఫోటోలకు పోజులు ఇచ్చాడు అనే విషయంలో అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. కానీ ఇంతవరకు కాంట్రవర్సీ ఎంత క్రియేట్ అయినా కూడా రణ్‌వీర్ సింగ్ పెదవి విప్పలేదు. ఎప్పటిలానే తన రెగ్యులర్ షూటింగ్స్ లో బిజీగా పాల్గొంటూ ఉన్నాడు.

ఎంత ఇచ్చారంటే?
అయితే రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటో స్టిల్స్ వెనుక ఏదో భావం ఉంది అని ప్రముఖులు చెబుతున్నప్పటికీ కూడా.. అతని ఈ ఫోటోషూట్ నిర్వహించడానికి ఏ స్థాయిలో పారితోషకం తీసుకున్నాడు అనేది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. దాదాపు రణ్‌వీర్ ఒక సినిమాకు తీసుకునే రెమ్యునరేషన్ 45 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో ఈ ఫోటోషూట్ కోసం పేమెంట్ గా తీసుకున్నట్లుగా కథనాలు విలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం రావాల్సిందే. ఇక మరోవైపు రణ్‌వీర్ బాలీవుడ్ లో ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











