నా జీవితం నాశనం అయింది, ఇక ఆపవయ్యా: అజయ్ దేవగన్‌కు అభిమాని రిక్వెస్ట్
Recommended Video
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ పలు పొగాకు సంబంధమైన ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నారు. అతడి ప్రచారం చూసి వాటి వైపు ఆకర్షితులైన అభిమాని ఇపుడు కేన్సర్ బారిన పడ్డారు. అతడి పేరు నానక్‌రాం. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ 40 ఏళ్ల ఈ అభిమాని.. అజయ్ దేవ ఇకపై పొగాకు ఉత్పుత్తులకు ప్రచారం చేయడం ఆపాలని కోరుతున్నారు.
అతడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... 'నానక్‌రాం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌కు వీరాభిమాని. ఆయన ప్రచారం చేసే పొగాకు ఉత్పత్తులనే కొన్నేళ్లుగా వాడుతున్నాడు. అయితే వాటి ప్రభావం తనపై ఎలా పడిందో ఇపుడు రియలైజ్ అవుతున్నాడు' అని తెలిపారు.

అజయ్ దేవగన్‌కు లేఖ
అజయ్ దేవగన్ పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయడం ఆపాలని కోరుతూ లేఖలను కూడా ఆయన పలు లేఖలను కూడా తన ఇష్ట నటుడి ఇంటికి పంపారు. పొగాకు వల్ల తాను, తమ కుటుంబం ఎంత ఎఫెక్ట్ అయ్యామో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన సంగానర్, జగత్‌పురా ప్రాంతాల్లో గోడలకు ఈ ప్రతులను అంటించారు.

మా నాన్న ఇపుడు రియలైజ్ అయ్యాడు
‘మా నాన్న నానక్‌రాం గత కొన్నేళ్లుగా పొగాకు నములుతున్నాడు. అజయ్ దేవగన్ ప్రచారం చేసే ఉత్పత్తులనే వాడుతున్నాడు. అపుడు ఆయన ఆ ప్రకటనలు చూసి ఆకర్షితులయ్యాడు. కానీ ఇపుడు కాన్సర్ బారిన పడ్డ తర్వాత అలాంటి ఉత్పత్తులకు అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ ప్రచారం చేయకూడదను అని కోరుకుంటున్నాడు.' అని నానక్‌రాం కుమారుడు దినేష్ మీడియాకు తెలిపారు.

ఇద్దరు పిల్లల తండ్రి, జీవితం నాశనం
ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన నానక్‌రాం ఇంతకు ముందు రాజస్థాన్‌లో సంగానర్‌లో టీ స్టాల్ నడిపిస్తూ జీవనం సాగించేవాడు. క్యాన్సర్ కారణంగా ఇపుడు అతడు పని చేయలేక పోతున్నాడు. మద్యం, సిగరెట్, పొగాకు లాంటి ఉత్పత్తులకు స్టార్స్ ప్రచారం చేయకూడదని, ఎవరూ వాటిని వాడకూడదని, వాటి వల్ల తన జీవితం నాశనం అయిందని ప్రచారం చేస్తున్నాడు.

అజయ్ దేవగన్
నానక్‌రాం విషయం జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయింది. మరి దీనిపై అజయ్ దేవనగ్ ఎలా స్పందిస్తారు అనేది హాట్ టాపిక్ అయింది. సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం దేదే ప్యార్ దే మే 17న విడుదలకు సిద్ధమైంది.


Click it and Unblock the Notifications











