Akshay Vs Salman: బిగ్ బాస్ 18 ఫైనల్ వివాదంపై అక్షయ్ కుమార్.. సల్మాన్ ఖాన్‌తో విభేదాల గురించి ఓపెన్!
ఇండియన్ ఆడియెన్స్ ఎంటర్టైన్మెంట్ రంగానికి కూడా పెద్ద పీట వేస్తారని అందరికీ తెలిసిందే. ఇలా ఒక్క బిగ్ స్క్రీన్ పై సినిమాలే కాకుండా స్మాల్ స్క్రీన్ అలాగే ఓటీటీ లలో కూడా రికార్డు రెస్పాన్స్ లు మనం ఇస్తాం. ఇంతే కాకుండా ఒక్క ఇండియన్ సినిమా నుంచి వచ్చిన అంశాలే కాకుండా బయట దేశాలకి కూడా మనవాళ్ళు బ్రహ్మరథం పడతారు. ఇలా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఈ క్రేజీ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ని కూడా మనం పెద్ద హిట్ చేసాం.
కాగా ఇండియా వైడ్ గా దాదాపు పాన్ ఇండియా అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యిన ఈ షో అత్యధికంగా అయితే హిందీ భాషలో ప్రసారం అవుతుంది. కాగా మన తెలుగులో 8 సీసన్ లు కంప్లీట్ అయితే హిందీలో ఇపుడు ఏకంగా 18వ సీజన్ నడుస్తుంది. మరి ఈ సీజన్ 18 కోసం ఒక కాంట్రవర్సీ ఇపుడు బయటకి వచ్చింది. కాగా బిగ్ బాస్ షో అంటేనే చాలా వరకు ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఆ ప్లాట్ ఫామ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంటారు.

కాగా ఇలానే పలు సినిమాల టీం లు హీరోలు హీరోయిన్స్ కూడా వెళుతూ ఉంటారు. కాగా ఇలానే హిందీలో కూడా పలువురు స్టార్స్ ప్రమోషన్స్ కోసం వెళుతుండగా వీరిలో ఇటీవల బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ కూడా వెళ్లడం జరిగింది. అయితే అనూహ్యంగా అక్షయ్ కుమార్ ఆ ఈవెంట్ నుంచి సడెన్ గా మాయమయ్యాడట. దీనితో ఆ షో హోస్ట్ అలాగే అక్షయ్ కో స్టార్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ త్వరగా రాకపోవడమే కారణం అని అందుకే అక్షయ్ వెళ్ళిపోయాడు అంటూ పలు పుకార్లు వెంటనే వచ్చాయి.
కాగా సల్మాన్ ఖాన్ రావాల్సిన సమయానికి రాకపోవడంతో అప్పటికే అక్షయ్ చాలా సేపు వైట్ చేయడం జరిగింది అని కానీ ఎంతకీ రాకపోవడంతో అక్షయ్ ఆగ్రహంతో వెళ్ళిపోయాడు అని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇపుడు దీనిపై అసలు క్లారిటీ బయటకి వచ్చింది. కాగా నిజానికి అక్షయ్ అక్కడ నుంచి వెల్లుపోయింది వాస్తవమే కానీ అది సల్మాన్ లేట్ చెయ్యడం వల్లో లేక సల్మాన్ మీద కోపం తోనో కాదట.

సల్మాన్ రావడం కొంచెం ఆలస్యం అవ్వడం అటుంచితే అక్షయ్ కుమార్ కి షూటింగ్ సమయం ఆలస్యం అవుతుంది అని తను వెళ్లిపోవాల్సి వచ్చిందట. దీనితో ఈ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ నడుమ జరిగిన అసలు రచ్చ ఇది అని క్లారిటీ వినిపిస్తోంది. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ హిందీలో సహా తెలుగులో కూడా భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నారు.
రీసెంట్ గానే మంచు విష్ణు చేస్తున్న ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి మహా శివునిగా అక్షయ్ ఫస్ట్ లుక్ కూడా బయటకు రాగా దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక సల్మాన్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ కాంబినేషన్లో "సికందర్" అనే భారీ ప్రాజెక్ట్ చేస్తుండగా ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది.


Click it and Unblock the Notifications











