నలుగురు హీరోయిన్లతో ఫారెన్ ట్రిప్.. భయపడుతున్న స్టార్ హీరో.. ఆమెను తల్చుకుని కన్నీళ్లు

బాలీవుడ్ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అక్షయ్ కుమార్. మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం పొందిన అక్షయ్ కుమార్ సినిమాల్లో ఒరిజనల్ స్టంట్స్ చేస్తూ ప్రేక్షకులకు రియల్ వినోదాన్ని పంచుతుంటాడు. అప్పుడప్పుడు రిస్కీ షాట్స్ చేసి షూటింగ్ లో గాయాల పాలు కూడా అయ్యాడు. ఇక సినిమా కోసం తనను ఎలా మార్చుకోవడానికైన సిద్ధపడతాడు.

అయితే గతేడాది బాయ్ కాట్ బాలీవుడ్ అనే నినాదం వచ్చిన నేపథ్యంలో తనకంటే కుర్ర హీరోయిన్లతో సినిమాలు, రొమాన్స్ చేయడంపై విమర్శలు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఏకంగా నలుగురు హీరోయిన్లతో ఫారెన్ టూర్ కు వెళ్లేందుకు భయపడుతున్నట్లుగా చెప్పి ఆశ్చర్యపరిచాడు అక్కీ.

కట్ పుట్లి కాస్తా..

కట్ పుట్లి కాస్తా..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హిట్లు, ఫ్లాపులు అంటూ చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేసే హీరోలో అక్షయ్ కుమార్ ఒకరు. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే వంటి మంచి హిట్స్ అందుకున్న అక్కీ బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, కట్ పుట్లి, రక్షా బంధన్, రామ సేతు వంటి చిత్రాలతో ప్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. వీటిలో కట్ పుట్లి కాస్తా పర్వాలేదనిపించుకున్న అంతగా ఒరిగింది మాత్రం ఏం లేదనే చెప్పుకొవచ్చు.

కిస్సింగ్ కిల్లర్ తో..

కిస్సింగ్ కిల్లర్ తో..

వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయే అక్షయ్ కుమార్ తాజాగా సెల్ఫీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కేవలం మూడు నిమిషాల్లో ఏకంగా 184 సెల్ఫీలు దిగి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు అక్షయ్ కుమార్. ఈ సెల్ఫీ సినిమాలో కిస్సింగ్ కిల్లర్ గా పేరొందిన ఇమ్రాన్ హష్మీ మరో లీడ్ రోల్ చేశాడు. అలాగే ఇందులో నుష్రత్ భరుచ్చా, టిస్కా చోప్రా, డయనా పెంటీ కూడా నటించారు. సీతా రామం బ్యూటి మృణాల్ ఠాకూర్ ఒక స్పెషల్ సాంగ్ లో అలరించింది.

అక్షయ్ తో పాటు వాళ్లు..

అక్షయ్ తో పాటు వాళ్లు..

డ్రైవింగ్ లైసెన్స్ అనే మలయాళ మూవీకి రీమెక్ గా వచ్చిన అక్షయ్ కుమార్ సెల్ఫీ ఫిబ్రవరి 24న విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ది కపిల్ శర్మ షోలో అక్షయ్ కుమార్ పాల్గొన్నాడు. పాపులర్ యాంకర్ కపిల్ శర్మ హోస్ట్ గా చేస్తున్న ఈ షోలోకి అక్కీతోపాటు నోరా ఫతేహి, దిశా పటానీ, సోనమ్ బజ్వా, మౌనీ రాయ్ హాజరయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

పొరపాటున కూడా..

పొరపాటున కూడా..

ఈ ప్రోమోలో అక్షయ్ చాలా టెన్షన్ గా ఉందని చెప్పాడు అక్షయ్ కుమార్. ఎందుకు అని కపిల్ అడిగితే.. "ఈసారి ఎంటర్టైనర్స్ టూర్ లో భాగంగా నేను నలుగురు హీరోయిన్లతో కలిసి ఫారెట్ కు వెళ్లాలి. అసలే నలుగురు హీరోయిన్స్. అది కూడా ఫారెన్ టూర్. అందుకే భయంగా ఉంది. అలాగే ఈ టూర్ కు వెళ్తున్నందుకు బాధపడుతున్నట్లు ఇంట్లో నటించాలి. పొరపాటును టూర్ నుంచి నేను సంతోషంగా తిరిగి వస్తే నాకు ఇంట్లో ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది" అని తన భార్య ట్వింకిల్ ఖన్నా గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావిస్తూ నవ్వించాడు అక్షయ్ కుమార్

అందరి తల్లుల లాగే..

అందరి తల్లుల లాగే..

అయితే అక్షయ్ కుమార్ ప్రతిసారి కపిల్ షోకి వచ్చినప్పుడు కపిల్ స్నేహితులు, సోదరిని వేదికపైకి పిలుస్తాడు. ఆసారి కపిల్ తల్లిని స్టేజి పైకి పిలిచి అతన్ని ఆశ్చర్యపరిచాడు అక్షయ్. ఈ సందర్భంగా తన కొడుకు గురించి ఆసక్తిర విషయాలు చెప్పుకొచ్చారు కపిల్ తల్లి. కపిల్ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. దీంతో చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అప్పుడు అందరి తల్లుల లాగే నేను నా కొడుకు వైపే మాట్లాడేదాన్ని అని ఆమె తెలిపారు.

నేను చెల్లించడం లేదు..

ఆ షో వేదికపై కపిల్, అతని తల్లి అనుబంధం చూసిన అక్షయ్ తన తల్లిని గుర్తు చేసుకున్నాడు. ఏడాదిన్నర క్రితం ఆమె చనిపోవడం గురించి కన్నీళ్లు పెట్టుకున్నాడు అక్షయ్ కుమార్. తర్వాత నోరా ఫతేహిని ప్రస్తావిస్తూ "ఒక వ్యక్తి మహిళతో డేటింగ్ వెళ్లినప్పుడు, రెస్టారెంట్ లో అతనే బిల్లు చెల్లించాలి" అని కపిల్ అంటుంటే.. అర్చన పురాణ్ సింగ్ కల్పించుకుని "నోరా ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు మహిళలు చెల్లించగలరు" అని అన్నారు. దీనికి "మీరు చెల్లించవచ్చు. కానీ నేను చెల్లించడం లేదు" అని బదులు ఇవ్వడంతో మళ్లీ అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X