Akshay Kumar: స్టార్ హీరో సంచలన నిర్ణయం.. దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు వెల్లడి!

సినిమా జయాపజయాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వరుసగా చిత్రాలు చేసుకుంటూ సత్తా చాటుతున్న బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్. ఏడాదికి కనీసం రెండు మూడు చిత్రాలు చేస్తూ తన హవా చాటుతుంతాడు. గతేడాది అంటే 2022 సంవత్సరంలో ఏకంగా 5 చిత్రాలు విడుదల చేసి తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ప్రస్తుతం రెండు మూడు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న అక్కీ మూడు నిమిషాల్లో 184 సెల్ఫీ ఫొటోలు దిగి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హీరోగా ఘనత సాధించాడు. అయితే తాజాగా ఆయన ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు వెల్లడించి షాక్ గు గురి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

90వ దశకంలో..

90వ దశకంలో..

హిందీ చిత్ర పరిశ్రమలో యాక్షన్ అండ్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అగ్ర హీరో అక్షయ్ కుమార్. ఆయన అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. అభిమానుల చేత అక్కీ అని ముద్దుగా పిలవబడే అక్షయ్ కుమార్ కెనడా ప్రవాస భారతీయుడని తెలిసిందే. అక్షయ్ కుమార్ ఇప్పటికీ హిందీ చిత్రసీమలో సుమారు 100కుపైగా చిత్రాల్లో నటించారు. 90వ దశకంలో ఎక్కువగా యాక్షన్ చిత్రాలతో అలరించిన అక్షయ్ కుమార్ ఆ తర్వాత కామెడీ మూవీస్ సూపర్ ఎంటర్టైన్ చేశారు.

ఏకంగా 5 చిత్రాలు..

ఏకంగా 5 చిత్రాలు..

యాక్షన్ అండ్ కామెడీ చిత్రాలు మాత్రమే కాకుండా రొమాన్స్ తో కూడా ఆకట్టుకున్నాడు 55 ఏళ్ల సీనియర్ హీరో అక్షయ్ కుమార్. ఇక హిట్లు, ఫ్లాపులు అంటూ చూడకుండా వరుస పెట్టి సినిమాలు చేసే బాలీవుడ్ హీరోలో ఎవరైనా ఉన్నారంటే అది అక్షయ్ కుమారే. అంతేకాకుండా సినిమాల్లో రియల్ స్టంట్స్ చేస్తూ ఆశ్చర్యపరుస్తాడు అక్కీ. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, కట్ పుట్లి, రక్షా బంధన్, రామ సేతు వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వీటిలో సూర్యవంశీ, ఆత్రంగి రే 2021లో రాగా మిగతా 5 చిత్రాలు గతేడాది విడుదల అయ్యాయి.

పౌరసత్వం ఎందుకు..

పౌరసత్వం ఎందుకు..

ప్రస్తుతం సెల్ఫీ, బడే మియా ఛోటే మియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు అక్షయ్ కుమార్. ఇటీవలే సెల్ఫీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కేవలం మూడు నిమిషాల్లో ఏకంగా 184 సెల్ఫీలు దిగి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు ఈ యాక్షన్ హీరో. అయితే అక్కీపై ఎప్పటి నుంచో కెనడా పౌరసత్వంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో తాజాగా మాట్లాడుతూ ఆయన అసలు ఎందుకు కెనడా పౌరసత్వం ఎదుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. అసలు విషయాలు తెలియకుండా తనను అలా బాధపెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

మాటలు చాలా బాధిస్తాయి..

మాటలు చాలా బాధిస్తాయి..

"ఇండియానే నాకు సర్వస్వం. నేను ఏం సంపాదించినా.. సాధించినా అన్నీ ఇక్కడి నుంచే. నేను పొందిన దాని నుంచి తిరిగి చెల్లించే సౌభాగ్యం కూడా నాకు దక్కింది. కానీ ఏం తెలియకుండా కొందరు మాట్లాడే మాటలు చాలా బాధిస్తాయి" అని తెలిపిన అక్షయ్ కుమార్ తను కెనడా పౌరసత్వాన్ని వదులుకుంటున్నట్లు షాకింగ్ విషయం చెప్పారు.

ఇంకేదైనా పని చేసుకోవాలని..

ఇంకేదైనా పని చేసుకోవాలని..

"నాకు హిందీలో సినిమాలు వర్కౌట్ కావట్లేదు. వేరే ఇంకేదైన పని చేసుకోవాలి అనిపించింది. అందుకే కెనడాకు పని కోసం వెళ్లాను. నా ఫ్రెండ్ ఒకరు కెనడాలో ఉన్నారు. నన్ను అక్కడకు రమ్మన్నారు. అంతే.. నేను అక్కడి పౌరసత్వానికి అప్లై చేసుకున్నాను. అక్కడికి వెళ్లాను. ఆ సమయంలో రెండు సినిమాలు మాత్రమే విడుదల కావాల్సింది ఉంది. అప్పుడే అదృష్టం కొద్దీ ఆ 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో మరికొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి" అని అక్షయ్ పేర్కొన్నారు.

నరేంద్ర మోది ఇంటర్వ్యూ తర్వాత..

నరేంద్ర మోది ఇంటర్వ్యూ తర్వాత..

వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఆ తర్వాత నా పాస్ పోర్ట్ గురించి నేను మర్చిపోయాను. దాన్ని కచ్చితంగా మార్చుకోవాలనే ఆలోచన కూడా నాకు తట్టలేదు. ఇటీవల ఒకసారి మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాను. కెనడా పౌరసత్వం వదులుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు అక్షయ్ కుమార్. ఇదిలా ఉంటే.. 2019 లోక్ సభ ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్షయ్ కుమార్ పౌరసత్వంపై దుమారం రేగింది.

15 సినిమాలు ఫ్లాప్ కావడంతో..

15 సినిమాలు ఫ్లాప్ కావడంతో..

ఖిలాడీ, హేరా ఫేరీ, నమస్తే లండన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా, ప్యాడ్ మ్యాన్ వంటి సినిమాలతో ఎంతగానో అలరించిన అక్షయ్ కుమార్ కు ఒక సమయంలో ఏకంగా 15 ఫ్లాప్ అయ్యాయి. 1990లో ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఓటమి చూడటంతో అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X