Anurag kashyap: " నాతో అది చేయడానికి 15 నిమిషాలకు లక్ష, గంటకు 5 లక్షలు ఇవ్వాలి"
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ సింగ్ కశ్యప్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన సినిమాలు తెరకెక్కించే ఈయన తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. తనతో అది చేయడానికి 15 నిమిషాలకు లక్ష రూపాయలు, అరగంటకు 2 లక్షలు, అదే గంట సేపు అయితే 5 లక్షలు చెల్లించాలని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. అసలు ఆయన ఇంతగా దేని కోసం ఛార్జ్ చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అనురాగ్ కశ్యప్.. కేవలం డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా, నటుడిగా కూడా అందరికీ పరిచయమే. అయితే 1997లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈయన ఇప్పటికీ సినిమాలు తెరకెక్కిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ఎప్పుడు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే ఈయన సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే తాజాగా ఈయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా అందులో చాలా విషయాలనే చెప్పుకొచ్చారు.

మొత్తంగా ఓ పెద్ద విషయం రాసుకొచ్చిన ఈయన.. తనకు ఎవరు ఫోన్ లు కానీ మెసేజ్ లు కానీ చేయొద్దని చెప్పారు. అలాగే ముందుగా డబ్బులు పంపిస్తే వారికి సమయం కేటాయిస్తానని చెప్పారు. తానేమీ స్వచ్ఛంద సంస్థను కాదని.. తక్కువ టైంలో విజయం సాధించాలని షార్ట్ కట్లు వెతుకునే వాళ్లను చూసి విసిగిపోయానంటూ వివరించారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చిన వారికి సలహాలు, సూచనలు ఇస్తూ తన సమయం వృథా చేసుకున్నానని.. ఇప్పటి నుంచి ఇంక అలా చేయనని చెప్పారు.
మేము తెలివైన వాళ్లం, టాలెంట్ ఉన్న వాళ్లం అని భావించే వారితో మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకోనని... ఏ పని ఫ్రీగా చేయనని డైరెక్టర్ అనురాగ్ సింగ్ కశ్యప్ వెల్లడించారు. ఎవరినీ ఊరికే కలవను అని, ఎవరితో ఊరికే మాట్లాడను అని వివరించారు. ప్రతీ దానికి ఓ రేటు నిర్ణయిస్తున్నానంటూ.. తనతో కలిసి మాట్లాడాలనుకునే వాళ్ల కచ్చితంగా ఫీజు చెల్లించాలని స్పష్టం చేశారు. అయితే తనతో 15 నిమిషాలు మాట్లాడాలంటే లక్ష రూపాయలు చెల్లించాలని అలాగే 30 నిమిషాలు అయితే రెండు లక్షలు చెల్లించాలని, ఇక గంటసేపు మాట్లాడాలనుకునే వాళ్లు ఏకంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని వెల్లడించారు.

అయితే ఈ డబ్బు మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని.. డబ్బులు ఇవ్వలేము, మెసేజ్ లు చేస్తామనే వాళ్లు దూరంగా ఉండాలంటూ వివరించారు. తక్కువ సమయంలో విజయం సాధించాలనుకుంటూ షార్ట్ కట్ లు వెతుక్కునే వాళ్లను చూసి విసిగిపోయానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాననంటూ పోస్ట్ చేసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











