లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ నుంచి ఇంకా కోలుకొని అమీర్ ఖాన్.. నెక్స్ట్ సినిమాపై ఏమన్నారంటే?
బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అనే గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు అమీర్ ఖాన్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న అమీర్ ఖాన్ గత కొంతకాలంలో సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఆయన చివరిగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ లాల్ సింగ్ చద్దాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
అమీర్ ఖాన్ కెరియర్ లో అతి తక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా లాల్ సింగ్ చద్దా మారింది. ఇక ఆ మూవీ ఎఫెక్ట్ తో అమీర్ ఖాన్ భాగా డిస్టర్బ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. చాలా కాలంగా మీడియాకి కూడా దూరంగా ఇంటి వద్దనే ఉంటున్న అమీర్ ఖాన్ ఓ పంజాబీ మూవీ క్యారీ ఆన్ జట్టా 3 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమీర్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి మీడియా అతనిని అడిగే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా తన అభిప్రాయాలని మీడియాతో అమీర్ ఖాన్ పంచుకున్నారు. నా నుంచి అభిమానులు ఓ మంచి చిత్రం ఆశిస్తున్నారని నాకు తెలుసు. కాని అందరిని నిరాశ పరుస్తున్నా. ఇప్పట్లో నాకు ఎలాంటి సినిమా చేసే ఉద్దేశ్యం అయితే లేదు.
ప్రస్తుతం నా టైమ్ అంతా ఫ్యామిలీ కోసమే స్పెండ్ చేస్తోన్న, వారితో ఇప్పుడు సినిమాల కంటే నా కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్న. నా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి భాగా ఆశ్వాదిస్తున్న. ఎమోషనల్ గా సిద్ధం అయినప్పుడు మాత్రమే మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తాను. దానికి ఎంత సమయం అయిన పడుతుంది అనేది ఇప్పుడే చెప్పలేను అని క్లారిటీ ఇచ్చారు.
కెరియర్ కంటే ఫ్యామిలీ కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మొత్తానికి అమీర్ ఖాన్ నుంచి సినిమా వస్తుందని ఆశించిన వారికి మిస్టర్ పెర్ఫెక్ట్ నిరాశని మిగిల్చాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అమీర్ ఖాన్ చివరిగా జోల్ లీడ్ రోల్ లో నటించిన సలాం వెంకీ అనే మూవీలో గెస్ట్ రోల్ లో నటించారు. అయితే తరువాత చాలా సినిమాలు నటిస్తున్నాడు అనే ప్రచారం జరిగిన ఇందులో వాస్తవం లేదని ఆయన మాట్లాతో క్లారిటీ ఇవచ్చింది. తనకి భాగా ఇష్టమైన లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ తోనే అమీర్ ఖాన్ ఇలా సినిమా పట్ల కొంత వైరాగ్యం చూపిస్తున్నారనే మాట వినిపిస్తుంది.


Click it and Unblock the Notifications











