Don't Miss!
- News
Sadist lady: ఫ్రెండ్స్ కు లోకేషన్ షేర్ చేసి మైనర్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేపించింది, నవ్వుతూ!
- Sports
భారత్ నాకు చాలా ఇచ్చింది.. అందుకే తిరిగి ఇవ్వాలని ఫిక్సయ్యా.. మంచి పనికి పూనుకున్న ఏబీ డివిలియర్స్
- Technology
త్వరలో భారత్లోకి 180W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా గల మొబైల్!
- Lifestyle
Health Tips: Healthy Fatty Foods:ఈ కొవ్వు పదార్ధాలు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడి, గుండెపోటును నివారిస్తాయి..
- Finance
Crorepati Tips: రూ.27 లక్షలకు 73 లక్షలు లాభం.. ఈ ఫార్ములాతో మీరే కోటీశ్వరులు.. పొదుపు పాఠాలు
- Automobiles
కొత్త 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు వెల్లవుతాయి.. ఎప్పుడంటే?
- Travel
బౌద్ధం.. జైనం.. గుంటుపల్లి చరిత్రలో నిక్షిప్తం
రాజమౌళితో సినిమాపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అమీర్ ఖాన్.. ఏమన్నారంటే?
దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలి అనే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే రాజమౌళి మాత్రం పూర్తిగా తెలుగు హీరోలతోనే సినిమాలు కొనసాగిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఆయన బాలీవుడ్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశాలు ఉంటాయని చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ గా అమీర్ ఖాన్ కూడా రాజమౌళితో వర్క్ చేయడం గురించి ఒక వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే..
దర్శకదీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసిన కూడా ఇకనుంచి ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతాయి అని RRR సినిమాతో మరోసారి క్లారిటీ వచ్చేసింది. బాహుబలి సినిమా తర్వాత అంతకుమించి అనేలా తెరపైకి వచ్చిన RRR సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో పాటు సినిమాలో అజయ్ దేవగన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించి మంచి సక్సెస్ ను షేర్ చేసుకున్నారు.

రాజమౌళి కోసం అలా..
ఇక RRR సినిమా సక్సెస్ అయిన తర్వాత రాజమౌళితో అవకాశం వస్తే సినిమా చేయాలి అని చాలామంది బాలీవుడ్ అగ్ర తారలు ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాతనే రాజమౌళితో ప్రత్యేకంగా సినిమా చేయాలి అని ఆలియా భట్ రిక్వెస్ట్ చేసి మరి అవకాశం అందుకుంది. ఇక రాజమౌళి క్రేజ్ ను ఉపయోగించి ఆలియాభట్ భర్త కూడా బ్రహ్మాస్త్ర సినిమాకు ఉపయోగించుకుంటున్నారు. తెలుగులో రాజమౌళి సమర్పణలో ఆ సినిమా విడుదలవుతోంది.

విదేశాల్లో కూడా..
RRR సినిమాతో కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి క్రేజ్ అందుకుంటున్నారు. ఏకంగా హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్స్ కూడా రాజమౌళి పనితీరును ఎంతగానో మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు కూడా ఆయనతో ప్రాజెక్టులను తెరపైకి తీసుకురావడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి.

అమీర్ ఖాన్ కోరిక
అయితే ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా రాజమౌళితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు మరోసారి క్లారిటీ వచ్చేసింది. బాహుబలి అనంతరం రాజమౌళితో చాలాసార్లు మాట్లాడిన అమీర్ ఖాన్ మహాభారతం సినిమా ఆయనతో చేయాలని ఉంది అని కూడా అన్నారు. వెబ్ సిరీస్ గా చేసినా కూడా తాను కృష్ణుడి పాత్రలో నటించడానికి రెడీ అని కూడా అమీర్ వివరణ ఇచ్చాడు.

మరోసారి క్లారిటీ ఇచ్చిన అమీర్
అయితే ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అమీర్ ఖాన్.. మీరు ఇంకా ఏ దర్శకులతో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు అని అన్నప్పుడు లిస్టులో చాలామంది ఉన్నారు అని ముఖ్యంగా ఇటీవల కాలంలో అయితే రాజమౌళితో సినిమా చేయాలి అని ఎంతో ఆసక్తిగా చూపిస్తున్నట్లు అమీర్ ఖాన్ తెలియజేసాడు. అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను అని తన మనసులోని మాటను తెలియజేశాడు. మరి భవిష్యత్తులో రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సినిమాను తెరపైకి తీసుకువస్తే అందులో అమీర్ ను తీసుకుంటాడో లేదో చూడాలి.